తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్‌లో సిలబస్‌ను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. మేలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్‌లో ఫస్టియర్‌ నుంచి 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలు రానున్నాయి. ఈ మేరకు సిలబస్‌ను ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థమే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల విడుదలైన ఎంసెట్‌ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. తగ్గించిన సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఇవ్వబోమని, ఇచ్చిన పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలొస్తాయని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డీన్‌కుమార్‌ తెలిపారు. కరోనాతో నిరుడు ఎంసెట్‌లో ఫస్టియర్‌, సెకండియర్‌ సిలబస్‌లో 70 శాతం మేరకే ప్రశ్నలిచ్చారు. తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫస్టియర్‌ సిలబస్‌లో 30శాతం తగ్గించి, సెకండియర్‌లో పూర్తి సిలబస్‌ను అమలు చేయనున్నట్టు డీన్‌కుమార్‌ వెల్లడించారు. మంగళవారం విడుదలయ్యే నోటిఫికేషన్‌లో సిలబస్‌ను పొందుపరుస్తామని ఆయన తెలిపారు.

ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు...
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. అయితే ఇంటర్‌లో కనీస మార్కులు సాధించాలన్న నిబంధనను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇంటర్‌లో జనరల్‌ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్‌డ్‌ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తేనే ఎంసెట్‌కు హాజరుకావొచ్చని సూచించింది.

కరోనా ప్రభావం కారణంగా మూడేళ్లకు ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్‌ వెయిటేజీ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటీ… జేఈఈ సహా ఇతర రాష్ర్టాలను అనుసరిస్తూ ఈ ఏడాది కూడా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల...
టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, నర్సింగ్‌) షెడ్యూలు ఫిబ్రవరి 24న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిప్రకారం మార్చి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్త ఏప్రిల్‌ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. 28న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో సీట్లను కూడా ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. దరఖాస్తు, ఫీజు ఇతర వివరాలకు  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Website

మే 7 నుంచి 11 వరకు పరీక్షలు..
తాజాగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్‌ పరీక్షలు మే 7న ప్రారంభమై, 11న ముగియనున్నాయి. మొదట మే 7 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఒక సెషన్‌కు 27 వేల మంది విద్యార్థులు మాత్ర మే పరీక్షలు రాసే అవకాశముండగా, తాజాగా ఈ సామర్థ్యాన్ని రోజుకు 40 వేలకు పెంచారు. దీంతో పరీక్షలు మే 11 తోనే ఎంసెట్ పరీక్షలు ముగియనున్నాయి. అయితే, దరఖాస్తుల సంఖ్య పెరిగితే పరీక్ష సెషన్లను కూడా పెంచుతామని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డీన్‌కుమార్‌ తెలిపారు. ఎంసెట్‌ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు.

ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇలా..

➥ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి:  28.02.2023

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.

➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023. 

➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.

➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.

➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.

➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.

➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 30.04.2023 నుంచి

➥ పరీక్ష తేదీలు:  మే 7 నుంచి 11 వరకు (మే 7 - 9 వరకు ఇంజినీరింగ్, మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్).

ఎంసెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌..
రాష్ట్రంలో ఎంసెట్‌ రాసే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. తెలంగాణ విద్యార్థులే కాకుండా ఏపీ ఇతర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు సైతం ఎంసెట్‌కు హాజరవుతున్నారు. దీంతో డిమాండ్‌ తీవ్రమవుతున్నది. మన దగ్గర ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా లభించడం, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లలో ఉత్తమ ప్యాకేజీలు లభిస్తుండటంతో విద్యార్థులు ఇటువైపే క్యూ కడుతున్నారు. ఇందుకు మూడేళ్లుగా ఎంసెట్‌కు వస్తున్న దరఖాస్తులే తార్కాణం.

సంవత్సరం ఇంజినీరింగ్ అగ్రికల్చర్
2020 1,43,265 78,981
2021 1,64,939 86,641
2022 1,72,238 94,476

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..