తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియడంతో 'స్పాట్' ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూలును ఉన్నతవిద్యామండలి విడుదల చేసింది. సెప్టెంబర్ 1న కాలేజీల్లో అంతర్గత స్లైడింగ్‌కు అవకాశం కల్పించినట్లు ఎంసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1న స్పాట్ ప్రవేశాలకు కళాశాలలు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.
వివరాలు..
* ఎంసెట్ స్పాట్ ప్రవేశాలు
అర్హత: టీఎస్ ఎంసెట్-2023 అర్హత కలిగి ఉండి, ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలలో కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులు ఉండాలి. ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. (లేదా) టీఎస్ ఎంసెట్-2023 అర్హత లేనివారుకూడా స్పాట్ ప్రవేశాలకు పొందడానికి అర్హులు.
ప్రాసెసింగ్ ఫీజు: ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు రూ.1300, అర్హత సాధించనివారు రూ.2100 చెల్లించాల్సి ఉంటుంది.
అవసరమయ్యే సర్టిఫికేట్లు..
➥ 10వ తరగతి ఒరిజినల్ మార్కుల మెమో.
➥ఇంటర్ ఒరిజినల్ మార్కుల మెమో
➥ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్లు
➥ TSEAMCET- 2023 ర్యాంకు కార్డు (అర్హత సాధించినవారు)
➥ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్
ముఖ్యమైన తేదీలు..
* కళాశాలలో ఇంటర్నల్ స్లైడింగ్: 01.09.2023.
* కళాశాలలు నోటిఫికేషన్ జారీ: 01.09.2023.
* మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ పేపర్ నోటిఫికేషన్: 02.09.2023.
* స్పాట్ ప్రవేశాలు: సెప్టెంబరు 3, 4 తేదీల్లో.
స్పాట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్..
స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల వివరాలు..
ALSO READ:
పారా మెడికల్ కోర్సులకూ ఈడబ్ల్యూఎస్ కోటా వర్తింపు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇకపై ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 29న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయనుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఈ కోటా ద్వారా 10శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు.
ఇకపై 22 భారతీయ భాషల్లో సీబీఎస్‌ఈ చదువులు - పుస్తకాల రూపకల్పన దిశగా ఎన్‌సీఈఆర్‌టీ
సీబీఎస్‌ఈ సిలబస్ పాఠశాలల్లో ఇకపై తెలుగులో కూడా బోధన మొదలుకానుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. నూతన విద్యా విధానం అమలు మొదలు వైద్య, న్యాయ, ఇంజినీరింగ్ కోర్సులను భారతీయ భాషల్లో బోధించేందుకు ఏర్పాట్ల వరకు దేశ విద్యారంగం కొత్తరూపు సంతరించుకుంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీకి మార్గం 'జామ్', పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభంకానుంది. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..