తెలంగాణలో ఎంసెట్-2023 ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం (జూన్ 26) ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 26 నుంచి జులై 5 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు జూన్ 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇది పూర్తయినవారు అభ్యర్థులు 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఐచ్ఛికాలను (వెబ్ ఆప్షన్లు) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 26 నుంచి జులై 19 మొదటివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తర్వాత జులై 21 నుంచి 31 వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక చివరగా మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 2 నుంచి 9 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 8న విడుదల చేయనున్నారు.
మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ జూన్ 26 - జులై 5 వరకు: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ జూన్ 28 – జులై 6: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
➥ జూన్ 28 – జులై 8: సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ (వెబ్‌ఆప్షన్స్)ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ జులై 8: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
➥ జులై 12: సీట్ల కేటాయింపు.
➥ జులై 12 – 19: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ జులై 21 – 22: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
➥ జులై 21 – జులై 24: సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ జులై 24: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
➥ జులై 28: సీట్ల కేటాయింపు
➥ జులై 28 – 31: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ ఆగస్టు 2: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
➥ ఆగస్టు 3: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
➥ ఆగస్టు 2: ఆగస్టు 4 – సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ ఆగస్టు 4: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
➥ ఆగస్టు 7: సీట్ల కేటాయింపు.
➥ ఆగస్టు 7 – ఆగస్టు 9: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
స్పాట్ ప్రవేశాలు...
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 8 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ & ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం వివరాలు...
పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు | 1,53,890 |
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు | 51,461 |
పరీక్షకు హాజరైన విద్యార్థులు | 1,95,275 |
ఉత్తీర్ణత సాధించినవారు | 1,57,879 |
ఉత్తీర్ణత శాతం | 80% |
బాలురు ఉత్తీర్ణత శాతం | 79% |
బాలికల ఉత్తీర్ణత శాతం | 82% |
అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్ వివరాలు..
పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు | 94,589 |
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు | 20,743 |
పరీక్షకు హాజరైన విద్యార్థులు | 1,01,544 |
ఉత్తీర్ణత సాధించినవారు | 91,935 |
ఉత్తీర్ణత శాతం | 86% |
బాలుర ఉత్తీర్ణత శాతం | 84% |
బాలికల ఉత్తీర్ణత శాతం | 87% |
మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష; మే 12 నుంచి 14 వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial