తెలంగాణ ఎంసెట్ 2022 ఫలితాలు ఆగస్టు 12న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూలును కూడా అధికారులు ప్రకటించారు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ సాగనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 21 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబరు 17న తుది విడత సీట్ల కేటాయింపుతో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది.


కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
☛ ఆగ‌స్టు 21 నుంచి ఆగ‌స్టు 29 వరకు ఆన్‌లైన్‌ స్లాట్ బుకింగ్
☛ ఆగ‌స్టు 23 నుంచి ఆగ‌స్టు 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
☛ ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు
☛ సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
☛ సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
☛ సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్
☛ సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
☛ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
☛ అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
☛ అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
☛ అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
☛ అక్టోబరు 11 నుంచి అక్టోబరు 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
☛   అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
☛   అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ


Also Read: తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ ఎంసెట్ 2022 ఫలితాలను ఆగస్టు 12న విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11.20 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేసిన సంగతి తెలిసిందే. ఎంసెట్ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.


రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగాలకు, అదేవిధంగా జులై 30, 31 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు.

Also Read: తెలంగాణ ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించి మొత్తం 1,72,238 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 1,56,860 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది అర్హత సాధించగా 80.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది.


 ఇక ఎంసెట్ మెడికల్ విభాగానికి మొత్తం 94,476 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,575 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 88.34 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. 

ఇప్పటికే ఎంసెట్-2022 పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీలను అధికారులు విడుదల చేశారు. కీపై  విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించి, ఆగస్టు 12న ఫలితాలను విడుదలచేశారు.  వాస్తవానికి ఎంసెట్ పరీక్ష జులై 14, 15 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా జులై 18 నుంచి 20 వరకు రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వేరిఫికేషన్ అనంతరం వెబ్ ఆఫ్షన్లు ఇస్తారు. అనంతరం సీట్ల కేటాయింపు ఉండనుంది.


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..