తెలంగాణలో రెండేళ్ల డీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించిన డీఈఈ సెట్ ప్రిలిమినరీ కీ జూన్ 6న విడుదలైంది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Exam Papers & Preliminary Keys
తెలంగాణ వ్యాప్తంగా జూన్ 1న నిర్వహించిన ఈ పరీక్షకు 79.40 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష కోసం మొత్తం 6,485 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,144 మంది పరీక్ష రాశారు. తాజాగా అధికారులు ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. ఈ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 8న సాయంత్రం 6 గంటల లోగా తెలపాల్సి ఉంటుంది.
డీఈఈసెట్ ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు అధికారులకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేయాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు చదవాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. వీటిలో పార్ట్-1: జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, పార్ట్-2: జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ తెలుగు/ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-3లో మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఫిజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, బయోలాజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
డీఈఈసెట్ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు..
➪ డీఈఈసెట్ 2023 నోటిఫికేషన్: 21.04.2023.
➪ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 22.04.2023.
➪ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 22.05.2023.
➪ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 27.05.2023.
➪ పరీక్ష తేది: 01.06.2023.
➪ ఫలితాల వెల్లడి: 08.06.2023.
➪ కౌన్సెలింగ్ (సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు): 12 -15.06.2023 నుంచి 05.07.2023 వరకు.
➪ తరగతులు ప్రారంభం: 12.07.2023.
Also Read:
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు
ఇది ఏఐ యుగం. కృత్రిమ మేధ రాజ్యమేలడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు ఏ రంగంలో చూసినా కృత్రిమ మేధ దూసుకుపోతోంది. కేవలం టెక్నాలజీ రంగం అనే కాకుండా ప్రతి రంగంలోనూ ఆర్డిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశిస్తోంది. ఇప్పటికే చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటి ఏఐ టూల్స్ చేస్తున్న పనులు చూస్తూ నోరెళ్లబెడుతున్నాం. ఏఐ టూల్స్ వాడుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, సినీ, క్రీడా ప్రముఖులు వంట వండుతున్నట్లు, సెల్ఫీలు తీసుకుంటున్నట్లు క్రియేట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాల్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఏఐపై పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని గూగుల్ సంస్థ ప్రత్యేకమైన కోర్సులను రూపొందించింది.
పూర్తివివరాలకు క్లిక్ చేయండి..
తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..