ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 77,424 సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా 13 ప్రైవేటు పాలిటెక్నిక్‌లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వడంతో అదనంగా మరో 3,180 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ప్రభుత్వ కళాశాలల్లో 16,494, ఎయిడెడ్‌లో 145, ప్రైవేటులో 60,785 సీట్లు ఉన్నాయి. దీనికి అదనంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఉంటాయి. కళాశాలల్లో ప్రవేశాలకు త్వరలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఏఐసీటీఈ అనుమతించిన సీట్లకు ప్రభుత్వం ఆమోదం లభించిన అనంతరం వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పిస్తారు.
తెలంగాణలో పెరిగిన 1170 సీట్లు..
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 1170 సీట్లను పెంచింది. 11 పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు అనుమతిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు వెల్లడించింది. ఈ మేరకు జులై 6న అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే, పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లోనూ పలు మార్పులు చేసింది. జులై 7న పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానుండటం, సీట్ల సంఖ్య పెరగడంతో ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేసింది. మారిన షెడ్యూల్ ప్రకారం.. జులై 8, 9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 10న పాలిసెట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. జులై 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇక జులై 14న తుది విడత పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్లను కేటాయిస్తారు.
ALSO READ:
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి!
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ. 27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు మరో అవకాశం, సీఎస్‌ఏబీ కీలక నిర్ణయం!
జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినా.. ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు రానివారికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం లభించదు. ఇలాంటివారి కోసం జోసా కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు ఓ అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, 75 శాతంలోపు మార్కులు వచ్చినవారు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మార్కులు పెంచుకుంటే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు లభిస్తుంది. జోసా కౌన్సెలింగ్‌కు హాజరైనప్పుడుగానీ, ప్రవేశాల సందర్భంలో గానీ మార్కుల జాబితా సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షల సమయంలో అనారోగ్యం, ఇతర కారణాలతో సరిగా పరీక్ష రాయలేక తక్కువ మార్కులు పొందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial