CUET UG 2024 Application: దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" దరఖాస్తు గడువు మార్చి 31తో ముగియనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 26తో ముగియాల్సిన గడువును మార్చి 31 వరకు పొడించిన సంగతి తెలిసిందే. సరైన అర్హతలున్నవారు నిర్ణీత ఫీజు చెల్లించి రాత్రి 9.50 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 27న సీయూఈటీ యూజీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఫిబ్రవరి 27న ప్రారంభించింది. మార్చి 28, 29 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 15 నుంచి 31 మధ్య సబ్జెక్టులవారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 30న ఫలితాలు వెల్లడిస్తారు.
సీయూఈటీ యూజీ స్కోరు ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం ప్రవేశాలు కల్పిస్తాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.
వివరాలు..
* కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ) - 2024
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: సీయూఈటీ (యూజీ)-2024 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ప్రవేశ పరీక్ష ఆధారంగాగా.
పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపుంపరే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపర్తి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, గద్వాల, హయత్‌నగర్.
* సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు
సీయూఈటీ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ప్రముఖ కేంద్రియ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి.
ముఖ్యమైన తేదీలు..
➸ సీయూఈటీ యూజీ -2024 నోటిఫికేషన్: 27.02.2024.
➸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.02.2024.
➸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.03.2024 (31.03.2024 రాత్రి 9:50 వరకు పొడిగించారు)
➸ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26.03.2024 (31.03.2024 రాత్రి 9:50 వరకు పొడిగించారు)
➸ పరీక్ష కేంద్రాల ప్రకటన: 30.04.2024 నుంచి.
➸ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: మే రెండో వారం, 2024.
➸ పరీక్ష ప్రారంభతేదీ: మే 15 నుండి మే 31, 2024 వరకు
➸ ఫలితాల ప్రకటన: 30.06.2024.
ALSO READ:
సీయూఈటీ యూజీ -2024 ద్వారా ఈ ఏడాది ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్దేశించిన 'సీయూఈటీ యూజీ' ప్రవేశ పరీక్ష పరిధిలోకి మరిన్ని యూనివర్సిటీలు వచ్చి చేరినట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈఏడాది 46 కేంద్రీయ యూనివర్సిటీలు, 32 రాష్ట్ర యూనివర్సిటీలు, 20 డీమ్డ్ వర్సిటీలు, 98 ప్రైవేటు యూనివర్సిటీలతోపాటు 6 ప్రభుత్వ విద్యాసంస్థలు సీయూఈటీ యూజీ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
యూనివర్సిటీల వివరాల కోసం క్లిక్ చేయండి..