తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తు గడువునను అధిాకారులు పొడిగించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 31తో ముగియాల్సిన దరఖాస్తు గడువును.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వినతి మేరకు ఏప్రిల్ 15 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


రాష్ట్రంలోని 35 జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. షెడ్యూలు ప్రకారం మే 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2023 పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌లో పదోతరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.  ప్రవేశ పరీక్షలో మెరిట్​, రిజర్వేషన్​ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.


పరీక్ష విధానం..


టీఎస్​ఆర్జేసీ కామన్​ ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టీపుల్​ చాయిస్​ విధానంలో ఉంటుంది. విద్యార్థులు ఎంచుకునే గ్రూప్​ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్​, మ్యాథ్స్​, ఫిజిక్స్​ నుంచి; బైపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్​, బయోలజికల్​ సైన్స్​, ఫిజిక్స్ నుంచి అదేవిధంగా ఎంఈసీ గ్రూప్​లో చేరేవారికి ఇంగ్లిష్​, సోషల్​ స్టడీస్​, మ్యాథ్స్​ సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కోసబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.  పరీక్ష సమయం రెండున్నర గంటలు. 


నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


Online Application


Also Read:


నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువ‌నేశ్వర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (నైస‌ర్), యూనివ‌ర్సిటీ ఆఫ్ ముంబ‌యి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఏకలవ్య గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రంలోని  23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.  బోధనా మాధ్యమం ఇంగ్లీషులో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..