TGEAPCET 2025 Counselling schedule | హైదరాబాద్: తెలంగాణ ఈఏపీసెట్ (ఇంజనీరింగ్) కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో భాగంగా శనివారం (జూన్ 28) నుంచి జులై 7 వరకు స్లాట్ బుకింగ్‌కు విద్యార్థులకు అవకాశం కల్పించారు. జులై 6 నుంచి జులై 10 వరకు వెబ్ ఆప్షన్ల ఇచ్చేందుకు షెడ్యూల్ చేశారు. అనంతరం జులై 14, 15 తేదీల్లో తొలి విడత మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలవుతుంది. మొదటి విడత సీట్లు కేటాయింపు జులై 18లోపు పూర్తి చేస్తారు. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్తొలి విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు అనంతరం సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతారు. జులై 25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ మొదలవుతుంది. జులై 26 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలవుతుంది. అదే సమయంలోనే జులై 26, 27 తేదీల్లో సెకండ్ ఫేజ్‌లో సీట్ల కేటాయింపులకుగానూ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జులై 30లోపు రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. ఆగస్టు 2వ తేదీలోగా సీట్లు వచ్చిన విద్యార్థులు కాలేజీలలో రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ సూచించారు. థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్చివరి ఫేజ్ కౌన్సెలింగ్ అయిన థర్డ్ ఫేజ్ ఆగస్టు 5 న ప్రారంభం కానుంది. అదేరోజు విద్యార్థులకు స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఆగస్టు 6, 7 తేదీల్లో ఫైనల్ గా విద్యార్థులకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. ఆగస్టు 10వ తేదీలోపు సీట్లు కేటాయిస్తామని టీజీఈఏపీసెట్ కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ లో పేర్కొన్నారు.