TG EDCET 2024 Results Link: తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఎడ్‌సెట్-2024 ఫలితాలు నేడు (జూన్ 11న) విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్ లింబాద్రి, మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ ఇంచార్జి వీసీ న‌వీన్ మిట్టల్ క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఎడ్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎడ్‌సెట్ ప్రవేశ ప‌రీక్షలో మొత్తం 96.90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.  గతేడాది ఎడ్‌సెట్ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించిన సంగతి తెలిసిందే. 


ఈ ఏడాది మే 23న రెండు సెష‌న్లలో టీజీఎడ్‌సెట్-2024 ప‌రీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2  నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొదటి సెష‌న్‌‌లో నిర్వహించిన పరీక్షకు 16,929 మందికి గానూ 14,633 మంది, రెండో సెష‌న్ 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు హాజ‌ర‌య్యారు. మొత్తం 87% హాజరుశాతం నమోదైంది. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల బాధ్యత చేపట్టింది. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో మొత్తం 14285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 


 టీజీ ఎడ్‌సెట్-2024 ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://edcet.tsche.ac.in/


➥ అక్కడ హోంపేజిలో కనిపించే ఫలితాలు/ర్యాంకు కార్డుకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 


➥ ఆ తర్వాత వచ్చే పేజీలో విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Result/View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 


➥ ప్రవేశ పరీక్ష ఫలితాలు/ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 


➥ విద్యార్థులు ఫలితాలు/ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


టీజీ ఎడ్‌సెట్-2024 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (10వ తరగతి వరకు)- 60 ప్రశ్నలు-60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-20 మార్కులు.


అర్హత మార్కులు.. 
ఎడ్‌సెట్-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి అర్హత మార్కులను 25 శాతం (38 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 


ALSO READ:


తెలంగాణ డీఈఈసెట్‌ దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'DEECET-2024' నోటిఫికేషన్‌ జూన్ 6న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 8న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 30 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
డీఈఈసెట్ నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..