తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సోసైటీల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మే 29న విడుదల చేశారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు 1.21 లక్షల మందికిపైగా విద్యార్థులు చేసుకున్నారు.
ఏప్రిల్ 23న నిర్వహించిన పరీక్షకు 1,13,219 మంది హాజరయ్యారు. తెలంగాణ సోసషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 232 మంది, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో 77 మంది, మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 146, ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో 35 సీట్లు భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలో 50 శాతం సీట్లు నియోజకవర్గ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ సంవత్సరం పది శాతం EWS కోటాను ప్రవేశపెట్టినట్లు వివరించారు. అదనంగా ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌లో ఎనిమిది సీట్లు కల్పించినట్లు చెప్పారు. అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
Also Read:
జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. జూన్ 4న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఐఐటీ గువాహటి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 4న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్- 2 పరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ కళాశాలలో బాలికలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
బాసర ట్రిపుల్ ఐటీ షెడ్యూల్ విడుదల, జూన్ 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ బుధవారం (మే 24) షెడ్యూలును ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్ కేటగిరీ కింద పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ తదితర విద్యార్థులు జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 26న మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. జులై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..