తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఇంటర్ రెగ్యులర్, ఫెయిల్ (జనరల్, ఒకేషనల్) విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుముతో డిసెంబరు 28 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు సూచించింది. కాగా వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూలును ఇంటర్ బోర్డు ఇటీవలే ప్రకటించింది.


డిసెంబర్ 14 నుంచి ప్రారంభమైన ప్రక్రియ అదనపు రుసుంతో 22 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే విద్యార్థులు, కాలేజీల విజ్ఞప్తి మేరకు తుది గుడువును పొడిగించింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్, (జనరల్, ఒకేషనల్) విద్యార్థులు రూ.1000 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.


మొదటి, రెండో సంవత్సరం ఆర్ట్స్‌(సీఈసీ, ఎంఈసీతో పాటు ఇతర కోర్సులు) విద్యార్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మొదటి సంవత్సరం ఒకేషనల్‌, రెండో సంవత్సరం ఒకేషనల్‌ విద్యార్థులు రూ.710 ఫీజు చెల్లించాలి. ఇంట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థుల‌తో పాటు గ‌తంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేష‌న‌ల్ కోర్సుల విద్యార్థులు ప‌రీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది.


ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలు..
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ డిసెంబరు 19న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 15న మొదలు కాగా, ఏప్రిల్ 3న ముగియనున్నాయి. సెకండియర్ ఎగ్జామ్స్  మార్చి 16న మొదలుకాగా, ఏప్రిల్ 4న ముగుస్తాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 



Also Read:


టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు, కోర్సుల వివరాలు ఇలా!
టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. టిస్  ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2023 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..