Telangana News: అద్భుతమైన మౌలిక సదుపాయాలు, అంతకు మించి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన, ప్లేస్ మెంట్ ఉద్యోగాలు కల్పించే ఉత్తమమైన తెలంగాణలోని టాప్ - 10 ఇంజనీరింగ్ కళాశాలలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టాప్ కాలేజీల్లో చదివిన వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


1. మహీంద్రా యూనివర్సిటీ - హైదరాబాద్


మహీంద్రా యూనివర్సిటీని ఇటీవలే ప్రారంభించారు. ఎన్ఐఆర్ఎఫ్ లో ఈ యూనివర్సిటీ 154వ ర్యాంకు సాధించింది. యూపీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ అందించే ఈ ఇంజినీరింగ్ కళాశాలలో మేనేజ్ మెంట్, డిజైన్, న్యాయశాస్త్రానికి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 


2. సీఆర్ఆర్ఆర్ఐటీ - హైదరాబాద్


గోకరాజు రంగరాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరంగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల. ఎన్ఐఆర్ఎఫ్ లో ఇది 148వ స్థానాన్ని దక్కించుకుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తుంది. జేఎన్టీయూకి అఫిలియేటెడ్ గా కొనసాగుతోంది ఈ కాలేజీ.


3. అనురాగ్ యూనివర్సిటీ - హైదరాబాద్


అనురాగ్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ తోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందిస్తోంది. ఈ యూనివర్సిటీలో ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, కంప్యూటర్ అప్లికేషన్లకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అనురాగ్ యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ 140వ ర్యాంకు ఇచ్చింది. 


4. యూసీఈ - హైదరాబాద్


హైదరాబాద్ లోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఎన్ఐఆర్ఎఫ్ లో 117వ ర్యాంకును పొందింది. ఉస్మానియా వర్సిటీ కింద ఈ కాలేజీ కొనసాగుతోంది. రీసెర్చ్, ఇన్నోవేషన్, కంపెనీలతో అనుసంధానమై పాఠాలు బోధిస్తుంది. 


5. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల


వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ హైదరాబాద్ జేఎన్టీయూ వర్సిటీకి అఫిలియేట్ గా కొనసాగుతోంది. ఈ విద్యాసంస్థకు ఎన్ఐఆర్ఎఫ్ లో 113వ ర్యాంకు వచ్చింది.


6. ఎస్ఆర్ యూనివర్సిటీ - వరంగల్


ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. డాక్టర్ ప్రోగ్రాములను అందిస్తోంది. ఈ సంస్థకు ఎన్ఐఆర్ఎఫ్ లో 91వ ర్యాంకు వచ్చింది. 


7. జేఎన్టీయూ - హైదరాబాద్


జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 76వ స్థానంలో నిలిచింది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అందులోబాటులో ఉన్నాయి. 


8. ఐఐఐటీ - హైదరాబాద్


ఐఐఐటీ హైదరాబాద్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 62వ స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత వర్సిటీలలో ఇదీ ఒకటి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ ఎడ్యుకేషన్ పై ప్రధానంగా దృష్టి పెడుతుంది. కంప్యూర్ సైన్స్, కృత్రిమ మేధ వంటి అధునాత టెక్నాలజీలపై ఫోకస్ పెడుతుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 62వ స్థానంలో నిలిచింది.


9. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - వరంగల్


నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్- వరంగల్ రాష్ట్రంలో ప్రఖ్యాత వర్సిటీల్లో ఒకటి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 21వ స్థానంలో నిలిచింది.


10. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - హైదరాబాద్   


ఐఐటీ హైదరాబాద్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 9వ స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత వర్సిటీలలో ఇదీ ఒకటి. కంప్యూర్ సైన్స్, కృత్రిమ మేధ వంటి అధునాత టెక్నాలజీలపై ఫోకస్ పెడుతుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 9వ స్థానంలో నిలిచింది.