Telangana TET (2)- 2024 Application: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-II- 2024 కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 7న అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 20 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు డిసెంబరు 26 నుంచి టెట్ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత మేలో నిర్వహించిన టెట్‎కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని అప్పట్లో సీఎం రేవంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా టెట్‌కు వీరందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం విద్యాశాఖ కల్పించింది.


ఫీజు తగ్గించిన ప్రభుత్వం..
టెట్‌ దరఖాస్తు ఫీజును కూడా ప్రభుత్వం భారీగా తగ్గించింది. గతంలో టెట్ పరీక్షలకు సంబంధించి ఒక పేపర్‎కు రూ.1000, రెండు పేపర్లు రాస్తే రూ.2000 ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఫీజను రూ.750కి కుదించారు. అంటే ఒక పేపర్‌ రాసేవారు రూ.750 చెల్లించాలి. రెండు పేపర్లు రాసేవారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు. ఆఫీస్: 70750 88812/70750 28881, వెబ్‌సైట్ సంబంధిత: 70750 28882/70750 28885, టెక్నికల్ సమస్యలకు: 70329 01383/ 90007 56178 నంబర్లలో సంప్రదించవచ్చు. నిర్ణీత పనివేళల్లో మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది. 


దరఖాస్తు ప్రక్రియ 2 రోజులు ఆలస్యం..
రాష్ట్రంలో టెట్ రెండో విడత నోటిఫికేషన్‌ను విద్యాశాఖ నవంబరు 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నవంబరు 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా 2 రోజులు ఆలస్యమైంది. దీంతో నవంబరు 7న రాత్రి నుంచి వెబ్‌సైట్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేవారు పేపర్-1, అదేవిధంగా 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు పేపర్-​2 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. 


పరీక్షలు ఎప్పుడంటే?
టెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. టెట్‌(2)-2024 ఫలితాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. మొత్తం 8 భాషల్లో టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతోపాటు ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పరీక్షలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు టెట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ కేటగిరీకి 60%, బీసీ కేటగిరీకి 50%, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీకి 40%గా విద్యాశాఖ నిర్ణయించారు. 


TET Notification


Infornation Bulletin


Fee Payment


Application Submission


Website


                                   

                                   


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...