తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు మార్చి 29తో ముగియనున్నాయి. ఇంటర్ పరీక్షలు ముగియగానే.. వారం రోజులకు పదోతరగతి పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో టెన్త్‌ పరీక్షలను ప్రారంభించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. ఈ జీవో జారీ అయితేనే తుది షెడ్యూల్‌ ఖరారుచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.


ఆలస్యరుసుముతో 29 వరకు ఫీజు చెల్లించే అవకాశం..


పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 29 వరకు అవకాశం ఉంది. ఆలస్యరుసుము లేకుండా నవంబరు 15తోనే దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 30 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో డిసెంబరు 15 వరకు ఫీజు స్వీకరించారు. ఇక డిసెంబరు 29 వరకు రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 29 వరకు ఫీజు చెల్లించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 


పరీక్ష ఫీజు వివరాలు..


➥ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125.


➥ మూడు లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులు రాసేవారికి ఫీజు: రూ.110.


➥ మూడు సబ్జెక్టుల కన్నా ఎక్కువ సబ్జెక్టులు రాసేవారికి ఫీజు: రూ.125.


➥ ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష ఫీజు: రూ.60 


6 పేపర్లతోనే పరీక్షల నిర్వహణ..
తెలంగాణలో ఇకపై ఏటా ఆరు పేపర్లతోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వల్ల గత విద్యాసంవత్సరంలో 11 పేపర్లకు బదులు ఆరు పేర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. కరోనా కారణంగా విద్యార్థులపై సిలబస్‌ భారం పడకుండా ఉండేందుకు గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకే నిర్వహించారు. అలాగే సిలబస్‌లోనూ కూడా మినహియింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ ఏడాది నుంచి ఇక ప్రతి సబ్జెక్టు ఒక పేపర్‌ ఉండనుంది. అంటే 6 పేపర్లతోనే పరీక్ష నిర్వహిస్తారు.


పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన NCERT విద్యార్థులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. పదో తరగతి విధి విధానాలను మారుస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్‌ఏ-1 పరీక్షలు జరుగుతున్నాయి. ఎస్‌ఏ-1 కూడా పదోతరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూలు రూపొందించారు.


Also Read:


తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ తాజాగా విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 15న మొదలు కాగా, ఏప్రిల్ 3న ముగియనున్నాయి. సెకండియర్ ఎగ్జామ్స్  మార్చి 16న మొదలుకాగా, ఏప్రిల్ 4న ముగుస్తాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..