TS SSC Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఎస్‌ఎస్‌సీ బోర్డు(SSC Board) ప్రకటించింది. మే 11 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.

Continues below advertisement

తెలంగాణలో పదో తరగతి పరీక్షల(SSC Exams) షెడ్యూల్‌ విడుదల అయింది. మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు(SSC Board) శుక్రవారం ప్రకటించింది. మే 18 నుంచి 20వ తేదీ వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 9.30 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Continues below advertisement

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు. త్వరలోనే పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

  • ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
  • 20-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-I 
  • 22-04-2022 : ఇంగ్లీష్ పేపర్-I
  • 25-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
  • 27-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I 
  • 29-04-2022 : ఫిజిక్స్ పేపర్-I, అర్థశాస్త్రం పేపర్-I 
  • 02-05-2022 : కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ -I 
  • 06-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
  • 09-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I 
  • ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు
  • 21-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-II 
  • 23-04-2022 : ఇంగ్లీష్ పేపర్-II
  • 26-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
  • 28-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II 
  • 30-04-2022 : ఫిజిక్స్ పేపర్-II, అర్థశాస్త్రం పేపర్-II 
  • 05-05-2022 : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II 
  • 07-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
  • 10-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II
Continues below advertisement