తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్‌-2023' (డీఎడ్‌) నోటిఫికేషన్‌ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. 


వివరాలు..


* డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2023 (డీఈఈసెట్‌-2023)


కోర్సులు..


1) డీఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)


2) డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్)


కోర్సుల వ్యవధి: 2 సంవత్సరాలు.


అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


వయోపరిమితి: 01.09.2023 నాటికి 17 సంవత్సరాలు కలిగి ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.500.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. వీటిలో పార్ట్-1: జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, పార్ట్-2: జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ తెలుగు/ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-3లో మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఫిజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, బయోలాజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 


ముఖ్యమైన తేదీలు..


డీఈఈసెట్ 2023 నోటిఫికేషన్: 21.04.2023.


ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 22.04.2023.


ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 22.05.2023.


హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 27.05.2023.


పరీక్ష తేది: 01.06.2023.


ఫలితాల వెల్లడి: 08.06.2023.


కౌన్సెలింగ్ (సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు): 12 -15.06.2023 నుంచి 05.07.2023 వరకు.


తరగతులు ప్రారంభం: 12.07.2023 


Notification


Online Application


Application Fee Payment


Website


                               


Also Read:


టెక్నికల్‌ టీచర్స్‌ కోర్సుకు దరఖాస్తులు స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే?
టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ 42 రోజుల సమ్మర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు (టీసీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌, హన్మకొండ, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కోర్సుకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆయా జిల్లా డీఈఓలను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. మే 1 నుంచి జూన్‌ 11 వరకు కోర్సు శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్ల పేర్కొన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


కొత్త డిగ్రీలు ఇక నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు!
తెలంగాణలో ఇకపై డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో (ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు) ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని దశల వారీగా అమలు చేయబోతున్నట్లు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం(2023-24) నుంచి మూడేళ్ల వ్యవధితో కంప్యూటర్‌ సైన్స్‌లో బీఎస్‌సీ ఆనర్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించగా తాజాగా దాన్ని నాలుగేళ్లకు పెంచనున్నారు. ఈ కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ను ఒక సబ్జెక్టుగా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా సిలబస్‌కు రూపకల్పన చేస్తున్నారు. కృత్రిమమేధ, సైబర్‌సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తదితర అంశాలను ఇందులో బోధిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..