Telangana Open School SSC, Inter Results: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(TOSS) పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు 11,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 4,053 మంది( 35.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్మీడియట్‌లో 15,348కి గాను 8,191 మంది (53.17 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మార్కుల మెమోలను సంబంధిత స్టడీ సెంటర్లకు 15 రోజుల్లో పంపించనున్నారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం డిసెంబరు 7 నుంచి 16వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
TOSS SSC RESULTS OCTOBER - 2023
TOSS INTER RESULTS OCTOBER - 2023
స్పెషల్ ప్రవేశాల గడువు పొడిగింపు..
ఓపెన్ స్కూల్‌లో స్పెషల్ అడ్మిషన్లకు డిసెంబర్ 11వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈ ఓ అబ్దుల్‌హై, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డి నేటర్ మురాళ శంకర్‌రావు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ విధానంలో ఈ విద్యా సంవత్సరం టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకుగాను అపరాధ రుసుంతో డిసెంబరు 11 వరకు గడువు పొడిగిస్తున్నట్లు డిసెంబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలులైన ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు పొందేందుకు ఎలాంటి ప్రాథమిక విద్యార్హతలు అవసరంలేదు. విద్యార్థులు కనీసం 14 సంవత్సరాలు నిండినవారై ఉండాలి. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా పదోతరగతి(సెకండరీ కోర్సు)లో ప్రవేశం పొందేందుకు అర్హులు. అదేవిధంగా సెకండరీ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ (సీనియర్ సెకండరీ కోర్సు)లో ప్రవేశాలకు పొందేందుకు అర్హులు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రాంతీయ ఎన్‌ఐఓఎస్ కేంద్రంలో సంప్రదించవచ్చు.
ప్రవేశాలు పొందాలనుకునే వారు ఏ తరగతిదైనా ఒరిజినల్ టిసీ, పుట్టిన తేది పత్రాలు రెండు జిరాక్స్ జతలతో పాటు కులదృవీకరణ, ఆధార్ కార్డు రెండు జతల జిరాక్స్‌లు, రెండు ఫోటోలు తీసుకుని సంబంధిత ప్రాంతీయ ఎన్‌ఐఓఎస్ కేంద్రంలో సంప్రదించాల్సి ఉంటుంది. ఓపెన్ ఇంటర్ లో చేరే వారు ఎస్‌ఎస్‌స్సీ మెమో, కుల దృవీకరణ, ఆధార్ రెండు జతల జిరాక్స్‌ల తోపాటు రెండు ఫోటోలు ఇవ్వాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ALSO READ:
విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు 'వీశాట్-2024' నోటిఫికేషన్ విడుదల
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాలు కోరువారు ఆయా క్యాంపస్‌ల్లో దరఖాస్తులు పొందవచ్చు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు కూడా ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. విశాట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..