TG LAWCET 2024 Counselling: తెలంగాణలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన 'టీజీ లాసెట్-2024' తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 5న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 21న ప్రకటించనున్నారు. అనంతరం  రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినవారు ఆగస్టు 22, 23 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు ఆగస్టు 24న అవకాశం కల్పించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి ఆగస్టు 27న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించిపు రశీదు, విద్యార్హతల సర్టిఫికేట్లతో సంబంధింత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


TG PGLCET-2024 Counselling: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం 'పీజీఎల్‌సెట్-2024' తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 5న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి 30 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినవారు సెప్టెంబరు 2, 3 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 31న ప్రకటించనున్నారు. వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు సెప్టెంబరు 4న అవకాశం కల్పించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబరు 6న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి 12 మధ్య నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించిపు రశీదు, విద్యార్హతల సర్టిఫికేట్లతో సంబంధింత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


8 వేల సీట్లు అందుబాటులో..
ఈసారి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతోపాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సులకు సంబంధించి 8 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కన్వీనర్‌ కోటా సీట్లు 7 వేల వరకు ఉన్నాయి. ఇందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 22 కళాశాలల్లో 4,790 సీట్లు; ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 19 కళాశాలల్లో 2,280 సీట్లు; రెండేళ్ల పీజీ లాడిగ్రీకి సంబంధించి రాష్ట్రంలోని 17 కళాశాలల్లో  మొత్తం 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..


➤ కౌన్సెలింగ్ నోటిఫికేషన్: 24.07.2024.


➤ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ పేమెంట్, వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్ల అప్‌లోడ్: 05.08.2024 - 20.08.2024.


➤ స్పెషల్ కేటగిరి (NCC / CAP / PH / Sports) అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన: 07.08.2024 - 10.08.2024.


➤ కౌన్సెలింగ్‌ అర్హుల జాబితా ప్రకటన: 21.08.2024.


➤ మొదటి విడత వెబ్‌ఆప్షన్ల నమోదు: 22.08.2024 - 23.08.2024.


➤ వెబ్‌ఆప్షన్ల సవరణకు అవకాశం: 24.08.2024.


➤ సీట్ల కేటాయింపు: 27.08.2024.


➤ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: 28.08.2024 - 30.08.2024.


TG LAWCET 2024 Counselling Notification
Counselling Website


పీజీఎల్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..


➤ కౌన్సెలింగ్ నోటిఫికేషన్: 24.07.2024.


➤ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ పేమెంట్, వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్ల అప్‌లోడ్: 05.08.2024 - 30.08.2024.


➤ స్పెషల్ కేటగిరి (NCC / CAP / PH / Sports) అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన: 07.08.2024 - 10.08.2024.


➤ కౌన్సెలింగ్‌ అర్హుల జాబితా ప్రకటన: 31.08.2024.


➤ మొదటి విడత వెబ్‌ఆప్షన్ల నమోదు: 02.09.2024 - 03.09.2024.


➤ వెబ్‌ఆప్షన్ల సవరణకు అవకాశం: 04.09.2024.


➤ సీట్ల కేటాయింపు: 06.09.2024.


➤ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: 09.09.2024 - 12.09.2024.


TG PGLCET 2024 Counselling Notification
Counselling Website