తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం న‌వంబ‌ర్ 2 నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల పరిశీలన చేయనున్నారు. న‌వంబ‌ర్ 18, 19 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవాలి. ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు న‌వంబ‌ర్ 22న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్లను కేటాయించ‌నున్నారు. న‌వంబ‌ర్ 28 నుంచి ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ నవంబరు 1న వెలువడనుంది.


కౌన్సెలింగ్ షెడ్యూలు...


➥ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్: నవంబరు 1న.


➥ ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన: న‌వంబ‌ర్ 2 నుంచి 12 వ‌ర‌కు.


➥ లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు న‌మోదు: న‌వంబ‌ర్ 18, 19 తేదీల్లో 


➥ సీట్ల కేటాయింపు: న‌వంబ‌ర్ 22న.


➥ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం త‌ర‌గ‌తులు ప్రారంభం: నవంబరు 28 నుంచి. 


కౌన్సెలింగ్ సాగేదిలా...


➥ లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.


➥ నిర్ణీత కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.


➥ రిజిస్ట్రేషన్ సమయంలోనే అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికేట్ (డాక్యుమెంట్స్) కాపీలను అప్‌లోడ్ చేయాలి.


➥ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారానే సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు.


➥ ధ్రువపత్రాల పరిశీలన పూర్తియివారు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.


➥ వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు తర్వాతి దశలో సీట్లను కేటాయిస్తారు.


➥ సీట్లు పొందినవారు ఫీజు చెల్లింపు చలనా, జాయినింగ్ రిపోర్ట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.


➥ అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాలలో నిర్ణీత వ్యవధిలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 


➥ సంబంధిత కళాశాలలో అభర్థులకు మరోసారి ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.


➥ సీట్ల కేటాయింపుకు సంబంధించిన అలాంట్‌మెంట్ ఆర్డన్‌ను తీసుకోవాలి.


➥ అనంతరం తరగతుల ప్రారంభం


➥ తొలివిడతలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి సంబంధించి తుది విడత కౌన్సెలింగ్ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.


కౌన్సెలింగ్ వెబ్‌సైట్: http://lawcetadm.tsche.ac.in/


రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు జులై 21, 22 తేదీలలో లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించగా, ఆగస్టు 17వ తేదీన లాసెట్ ఫలితాలను ప్రకటించారు. మూడేళ్ల లా కోర్సుకు 15,031 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా,ఐదేళ్ల కోర్సుకు 4,256 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే పీజీఎల్‌సెట్‌కు 2,375 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు యూనివర్సిటీలో 26 న్యాయ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 12 బ్రాంచులున్నాయి.



 

Also Read:

 

పదోతరగతి పరీక్ష ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం, ఆలస్య రుసుముతో చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లించే తేదీలను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. నవంబరు 15 వరకు ఎలాంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల హెడ్‌ మాస్టర్లకు ఫీజును చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. ఇక రూ.50 ఆలస్యరుసుముతో నవంబర్‌ 30 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 15 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపు తేదీల్లో ఏమైనా సెలవులు వస్తే.. మరుసటిరోజు ఫీజు చెల్లించవచ్చు.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..