Telangana Jobs Notification 2022: తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మొత్తం 91,142 పోస్టులకు నోటిఫై చేశారు. 11 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్‌కు నిర్ణయం తీసుకోగా మిగతా 80,039 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టుల వివరాలు విడుదల చేశారు. 


గ్రూప్‌ల వారీగా ఖాళీలు..
గ్రూప్‌ 1- 503 పోస్టులు
గ్రూప్‌ 2- 582 పోస్టులు
గ్రూప్‌ 3 - 1,373 పోస్టులు
గ్రూప్‌ 4 - 9168 పోస్టులు


క్యాడర్ల వారీగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలు..
జిల్లాల్లో - 39,829 పోస్టులు
జోన్లలో - 18,866 పోస్టులు
మల్టీజోనల్‌ - 13,170 పోస్టులు
సెక్రటేరియట్,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాలు - 8,147 పోస్టులు


జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్ – 1,976
మేడ్చల్ - మల్కాజ్‌గిరి – 1,769
రంగారెడ్డి – 1,561
కరీంనగర్ – 1,465
నల్లగొండ – 1,398
కామారెడ్డి – 1,340
ఖమ్మం – 1,340
భద్రాద్రి - కొత్తగూడెం – 1,316
నాగర్‌కర్నూల్ – 1,257
సంగారెడ్డి – 1,243
మహబూబ్‌నగర్ – 1,213
ఆదిలాబాద్ – 1,193
సిద్దిపేట – 1,178
మహబూబాబాద్ – 1,172
హన్మకొండ – 1,157
మెదక్ – 1,149
జగిత్యాల – 1,063
మంచిర్యాల – 1,025
యాదాద్రి - భువనగిరి – 1,010
జయశంకర్ భూపాలపల్లి – 918
నిర్మల్ – 876
వరంగల్ – 842
కొమురం భీం ఆసిఫాబాద్ – 825
పెద్దపల్లి – 800
జనగాం – 760
నారాయణపేట్ – 741
వికారాబాద్ – 738
సూర్యాపేట – 719
ములుగు – 696
జోగులాంబ గద్వాల్ – 662
రాజన్న సిరిసిల్ల – 601
వనపర్తి – 556
మొత్తం పోస్టులు - 39,829 


జోన్ల వారీగా ఖాళీలు..
కాళేశ్వరం జోన్‌ - 1,630
బాసర జోన్‌ - 2,328
రాజన్న జోన్‌ - 2,403
భద్రాద్రి జోన్‌ - 2,858
యాదాద్రి జోన్‌ - 2,160
చార్మినార్ జోన్‌ - 5,297
జోగులాంబ జోన్‌ - 2,190
మొత్తం పోస్టులు - 18,866 


మల్టీజోన్లలో ఖాళీలు
మల్టీజోన్ 1 - 6,800
మల్టీజోన్ 2 - 6,370
మొత్తం పోస్టులు - 13,170


ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి..
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయి. ఆయా శాఖల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు పేర్కొన్నారు.


శాఖలు -  పోస్టుల సంఖ్య
హోం శాఖ - 18,334
సెకండరీ ఎడ్యుకేషన్ - 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ - 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్ - 7,878
బీసీల సంక్షేమం - 4,311
రెవెన్యూ శాఖ - 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ - 2,879
నీటిపారుదల శాఖ - 2,692
ఎస్టీ వెల్ఫేర్ - 2,399
మైనారిటీ వెల్ఫేర్ - 1,825
ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ - 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయిమెంట్ - 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ - 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ - 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్ - 801
రవాణా, రోడ్లు, భవనాలు - 563
న్యాయశాఖ - 386
పశుపోషణ, మత్స్య శాఖ - 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్ - 343
ఇండస్ట్రీస్, కామర్స్ - 233
యూత్, టూరిజం, కల్చర్ - 184
ప్లానింగ్ - 136
ఫుడ్, సివిల్ సప్లయిస్ - 106
లెజిస్లేచర్ - 25
ఎనర్జీ - 16 
రాష్ట్రంలో మొత్తం పోస్టులు - 80,039


Also Read: KCR Jobs Announcement: నిరుద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్! 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, కేసీఆర్ సంచలన ప్రకటన 


Also Read: Age Relaxation: ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితి భారీగా పెంపు, SC, STలకు మరింతగా - KCR వరాల జల్లు