Diet charges for welfare hostel : తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో రాష్ట్ర ప్రభుత్వం డైట్‌ ఛార్జీలను పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జులై 22న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు, పలు శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ...డైట్ చార్జీల పెరుగుదల కోసం సిఎం కేసీఆర్ మంత్రుల సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్ గారికి సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది.


పెరిగిన డైట్ చార్జీల ద్వారా... ట్రైబల్ వెల్పేర్, ఎస్సీ వెల్పేర్, బీసీ వెల్పేర్ గురుకులాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు తదితర మొత్తం గురుకులాల్లోని దాదాపు 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యార్థులకు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించుదుకు అందుకు అనుగుణంగా చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సిఎం స్పష్టం చేశారు. డైట్ చార్జీలు పెంచుతూ ఫైలు పై సంతకం చేసిన సందర్భంగా గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సిఎం కేసీఆర్ గారికి కృతజ్జతలు తెలిపారు.


ప్రస్తుతం అందిస్తున్న చార్జీలకు అదనంగా 26 శాతం చార్జీలు పెరిగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు మరో 237.24 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారాన్ని లెక్కచేయకుండా రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు


పెరిగిన డైట్ చార్జీల వివరాలు ఇలా..


➥ 3వ తరగతి నుంచి 7 వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న రూ.950 ల డైట్ చార్జీలు రూ.1200 లకు పెరిగాయి.


➥ 8వ తరగతి నుంచి 10వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1100 నుంచి రూ.1400 లకు పెరిగాయి.


➥ 11వ తరగతి నుంచి పీజీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1500 నుంచి రూ.1875 లకు పెరిగాయి.


ALSO READ:


దివ్యాంగులకు రూ.4016కు పెరిగిన ఆసరా పింఛను..
దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ఆసరా పింఛను రూ.4016కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు జులై నెల పింఛను నుంచే సవరించిన పింఛను రూ.4016 అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు లబ్ది చేకూరనుంది.  జూన్ 9న మంచిర్యాలలో జరిగిన సభలో వికలాంగుల ఫించను రూ. 3,016 రూపాయల నుంచి రూ. 4,106 లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు  ప్రకటించారు. ఈ పెరిగిన పింఛన్లు జులై నెల నుంచి అమలులోకి రానున్నట్లు సర్కార్ తాజాగా జీవో ఇచ్చింది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం, మాతృభాషలో విద్యాబోధన - పాఠశాలలకు అనుమతి!
మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది. ఒకవైపు ఏపీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం. 
పూర్తిసమాచారం కోసం క్లిక్ చేయండి..


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial