Dussehra Holidays: తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు తగ్గించే దిశగా ఆలోచనలు చేస్తోంది. దసరా సెలవులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు పదిరోజులు ఇచ్చే సెలవులు ఈసారి పదహారు రోజులు వస్తుండటంతో సర్కారు సెలవులు తగ్గించాలని చూస్తోంది. గతంలో భారీ వర్షాల కారణంగా మూడు రోజులు సెలవులు ఇచ్చారు. ఇప్పుడు పదహారు రోజులంటే సిలబస్ పూర్తి కాకుండా పోతోందనే ఉద్దేశంతోనే సెలవులు తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిలబస్ పూర్తి కాకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో సెలవులు తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. చిన్న తరగతులకు యథాతథంగా సెలవులు ఇస్తున్నా పెద్ద తరగతులకు మాత్రం తగ్గించే యోచన చేస్తున్నారు. ముఖ్యంగా 9,10 తరగతుల విద్యార్థులకు సెలవులను తగ్గించాలని యోచిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయా తరగతుల విద్యార్థులకు సిలబస్ పూర్తి కావడంలో ఆలస్యం అవుతుండటమే. 


Also Read: తెలంగాణలో 16 రోజుల 'దసరా' సెలవులు, ఏపీలో సెలవులు ఇలా?


సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు 16 రోజులు సెలవులు రానుండటంతో సిలబస్ పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతోనే ఈ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అధిక సెలవులతోనే వస్తున్న ఇబ్బందుల దృష్ట్యా సర్కారు ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. విద్యార్థులకు సెలవులు తగ్గించి సిలబస్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సెలవులు తగ్గించే ఆలోచనపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

దీనిపై ప్రభుత్వ సూచన మేరకే విద్యార్థుల భవిష్యత్‌ను పరిగణనలోకి తీసుకుని సెలవులు తగ్గించడంతో ఉపాధ్యాయులు ఈ మేరకు స్కూళ్లు నడపాల్సిందే. చిన్న తరగతులకు సమస్యలు లేకున్నా పెద్ద తరగతులను నిర్వహించాలని చూస్తున్నారు. సిలబస్ పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు కూడా ఈ మేరకు పని చేయాలని ఆదేశాలు జారీ చేసేందుకు ముందుకు రావడం గమనార్హం. ఏదిఏమైనా దసరా సెలవులు ఈ సారి ఎక్కువ రోజులు రావడం చిన్న పిల్లలకు సంతోషంగా ఉన్నా పెద్దవారికి మాత్రం ఇబ్బందులు తెస్తున్నా పాఠశాలకు హాజరు కావాల్సిందే.


16 రోజుల సెలవులు...
తెలంగాణ‌లో పాఠశాలలు, కళాశాలలకు ఈ సారి 16 రోజులపాటు దసరా సెలవులు రానున్నాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు మొత్తం 14 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివ‌రాల‌ను ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. 

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే..
♦ సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు). బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి మొత్తం 16 రోజులు సెలవులు.
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
♦ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు
♦ వేసవి సెలవులు ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..