దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) 2023 -24 నాటికి అదనంగా మరో 10వేల మంది కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌సిసిబి, తెలంగాణ ప్రభుత్వం కలిసి 2022లో తమ భాగస్వామ్య మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 10,196 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాయి.


తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి సి హెచ్ మల్లారెడ్డి సమక్షంలో హెచ్‌సీసీబీ , తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్నివిస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, జయేష్ రంజన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, హిందూస్థాన్‌ కోకా-కోలా బెవరేజెస్ చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి , కంపెనీ హెడ్, హెచ్ ఆర్ చిత్ర గుప్తా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


ALSO READ:


ఏపీలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు జులై 20 నుంచి కౌన్సెలింగ్! ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి!
ఏపీ రాష్ట్రంలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఆర్జీయూకేటీ అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం జులై 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. నూజివీడులో జులై 20, 21 తేదీల్లో, ఇడుపులపాయలో జులై 21,22 తేదీల్లో; ఒంగోలు, శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల ట్రిపుల్ఐటీ క్యాంపస్‌కు జులై 24-25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల పరిధిలో మొత్తం 4,040 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన కాల్ లెటర్లను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు తర ఆర్జీయూకేటీ అప్లికేషన్ నెంబరు, పదోతరగతి హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఈ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉంటే, అన్ని పనులు సకాలంలో చక్కబెట్టుకోవచ్చు!
అంబానీకైనా, అదానీకైనా.. పీఎంకైనా, సీఎంకైనా రోజులో ఉండే 24 గంటలే. మీకు, నాకు కూడా రోజుకు 24 గంటలే ఉంటాయి. ఇప్పుడు అందరివీ బిజీ లైఫ్‌లే. ఒక పని కాకపోతే మరొకటి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చేయాల్సిన పనులు, నెరవేర్చాల్సిన బాధ్యతలు ఎక్కువ, ఉన్న టైమ్ తక్కువ. ప్రతి దానికి సమయం కేటాయించాల్సిందే. ప్రతి పనిని  శ్రద్ధతో చేయాల్సిందే. పనికి ఎంత సమయం కేటాయిస్తామో.. కుటుంబానికి కూడా అంతే సమయం ఇవ్వాలి. కుటుంబాన్ని వదిలేసి మొత్తం పనిలోనే బిజీ అయిపోవద్దు. అలాగే, పనిని వదిలేసి కుటుంబానికే పూర్తి సమయం కేటాయించవద్దు. ఏ పనికి, ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో కచ్చితంగా అంతే ఇచ్చితీరాలి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial