Telangana Pongal Holidays 2024: తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు (Sankranthi Holidays) ఉంటాయని ప్రభుత్వం బుధవారం (జనవరి 3) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా జనవరి 13న 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. 


సంక్రాంతి సెలువులు జనవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి.. జనవరి 13న రెండో శనివారం, తర్వాత జనవరి 14న ఆదివారం భోగి పండుగ కాగా.. జనవరి 15న సోమవారం సంక్రాంతి పర్వదిన వస్తోంది. ఇక,  జనవరి16న కనుమ పండగ ఉంది. కాగా, జనవరి 17న ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వస్తున్నాయి.


ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే ఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. కాగా.. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి.


తెలంగాణలో 2024 సాధారణ సెలవులు ఇలా..
2024కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెల‌వుల లిస్టును ప్ర‌క‌టించింది. 2024 ఏడాదిలో సాధార‌ణ సెల‌వులు 27 కాగా, ఆప్షనల్ హాలిడేస్ 25 ఉండ‌నున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సెల‌వు, మార్చి 8న మ‌హా శివ‌రాత్రి, మార్చి 25న హోలీ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామ‌న‌వమి, జూన్ 17న బ‌క్రీద్, సెప్టెంబ‌ర్ 7న వినాయక చ‌వితి, అక్టోబ‌ర్ 10న ద‌స‌రా, అక్టోబ‌ర్ 31న దీపావ‌ళికి సెల‌వులు ప్రక‌టిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అందుకు బదులుగా ఫిబ్రవరి నెలలో 10వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది.


ALSO READ:


ఏపీలో సంక్రాంతి పండగకు మొత్తం ఎన్ని రోజులు సెలవులంటే ..?
ఏపీలో ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే.. ఈసారి సంక్రాంతి సెలవులు నాలుగు, ఆరు రోజులు ఉన్నట్లు తెలుస్తున్నాయి.. జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..జనవరి 13 రెండో శనివారం.. జనవరి 14న భోగి పండగ.. ఆదివారం వచ్చింది. జనవరి 15న సంక్రాంతి పండగ.. సాధారణంగా సెలవులు ఉంటుంది. అలాగే జనవరి 16న ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్‌, కాలేజీలకు మరో రెండు రోజులు పాటు అదనం సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.. దాంతో మొత్తం ఆరు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది..ఇంకా ఈ ఈనెల నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఈ నెలలో రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి.