తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఫిబ్రవరి 7న ప్రకటించారు. ఈ మేరకు కార్యాలయంలో మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వీ వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..  మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష, మే12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది.  ఇక  మే 18న ఎడ్‌సెట్‌, మే 20న ఈసెట్‌, మే 25న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌,  మే 26న ఐసెట్‌, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.  పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్  ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.

Also Read: ఏయూ దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి!


షెడ్యూలు ఇలా..

➥ మే 7 నుంచి 14 ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష నిర్వహించనున్నారు.

➥ మే 18న ఎడ్‌సెట్‌

➥ మే 20న ఈసెట్‌

➥ మే 25న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌

➥ మే 26న ఐసెట్‌

➥ మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌

ఇప్పటికే సెట్ల కన్వీనర్ల ప్రకటన..
తెలంగాణ‌లో 2023-24 విద్యా సంవ‌త్సరానికి సంబంధించి ఎంసెట్ సహా మరో 6 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లను నిర్వహించే వ‌ర్సిటీల‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండ‌లి ఇప్పటికే ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ ప‌రీక్షల‌కు సంబంధించిన క‌న్వీన‌ర్లను కూడా ఉన్నత విద్యా మండ‌లి ప్రకటించింది. ఈ ఏడాది టీఎస్ ఎంసెట్, టీఎస్ పీజీఈసెట్‌ నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను జేఎన్టీయూహెచ్‌కు అప్పగించింది. టీఎస్ ఐసెట్‌ - కాక‌తీయ యూనివ‌ర్సిటీకి, టీఎస్ లాసెట్‌, పీజీఎల్‌సెట్, ఈసెట్ - ఉస్మానియా యూనివ‌ర్సిటీ, టీఎస్ ఎడ్‌సెట్ - మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ, టీఎస్ పీఈసెట్ - శాత‌వాహ‌న‌ యూనివ‌ర్సిటీకి అప్పగించారు.

Also Read: బిట్‌శాట్‌- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

ఎంసెట్‌ కన్వీనర్‌గా డీన్‌కుమార్‌..
ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న ప్రొఫెసర్ బి. డీన్ కుమార్‌ను నియమించారు. గత మూడేళ్లుగా ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, రెక్టార్ గోవర్ధన్ కొనసాగగా.. ఈసారి డీన్ కుమార్‌ను నియమించారు. ఈయన గతంలో పరీక్షల నియంత్రణ విభాగం కంట్రోలర్‌గా, చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఈసారి కొత్తగా ఐసెట్, లాసెట్ కన్వీనర్లుగా మహిళలు రావడం విశేషం.

ఇప్పటివరకు ఈసెట్‌ను జేఎన్‌టీయూహెచ్ నిర్వహించగా.. ఈసారి దాన్ని ఓయూకు అప్పగించారు. ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఇంజినీరింగ్ సెట్‌ను ఓయూ నుంచి తొలగించి జేఎన్టీయూహెచ్‌కు కేటాయించారు. అంతేకాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్(పీఈసెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్షను నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నుంచి తొలగించి, కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీకి అప్పగించారు.

ఇప్పటివరకు ఓయూ చేతులో ఉన్న ఎడ్‌సెట్(బీఈడీ సీట్ల భర్తీకి)ను మహాత్మాగాంధీ వర్సిటీకి కేటాయించారు. ఎంసెట్, ఐసెట్, లాసెట్‌లను గతంలో చేపట్టిన యూనివర్సిటీలే నిర్వహిస్తాయి. ఎడ్‌సెట్, పీఈసెట్‌లను ఇతర వర్సిటీలకు కేటాయించినా కన్వీనర్లు మాత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులే ఉంటారు. ఎడ్‌సెట్‌కు గత ఏడాది కన్వీనర్‌గా వ్యవహరించిన రామకృష్ణ ఈ ఏడాది కూడా కొనసాగనున్నారు.

Also Read: మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!

ప్రవేశ పరీక్ష కన్వీనర్ యూనివర్సిటీ
టీఎస్ ఎంసెట్  ప్రొఫెస‌ర్ బి. డీన్ కుమార్  జేఎన్టీయూ-హైదరాబాద్
టీఎస్ పీజీ ఈసెట్  ప్రొఫెస‌ర్ బి. ర‌వీంద్ర రెడ్డి  జేఎన్టీయూ-హైదరాబాద్
టీఎస్ ఐసెట్  ప్రొఫెస‌ర్ పి. వ‌ర‌ల‌క్ష్మి  కాక‌తీయ యూనివ‌ర్సిటీ
టీఎస్ ఈసెట్  ప్రొఫెస‌ర్ శ్రీరాం వెంక‌టేశ్  ఉస్మానియా యూనివ‌ర్సిటీ
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్  ప్రొఫెస‌ర్ బి. విజ‌య‌ల‌క్ష్మి  ఉస్మానియా యూనివ‌ర్సిటీ
టీఎస్ ఎడ్‌సెట్  ప్రొఫెస‌ర్ ఎ. రామ‌కృష్ణ  మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ
టీఎస్ పీఈసెట్  ప్రొఫెస‌ర్ రాజేశ్ కుమార్ శాత‌వాహ‌న‌ యూనివ‌ర్సిటీ

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..