ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ స్పెషల్ అడ్మిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జనవరి 9 నుండి జనవరి 13 వరకు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే సంబంధిత సర్టిఫికెట్లను ఓపెన్ టెన్త్, ఇంటర్ సెంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది.
Website 


గురుకుల 'లా' కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు..
హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఎస్సీ గురుకుల లా కాలేజీలో లా కోర్సులో ఖాళీ సీట్ల భర్తీకి జనవరి 9న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఏ, ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. లా సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా స్పాట్‌ అడ్మిషన్లు కల్పించనున్నారు. క్యాటగిరీల వారీగా ఎస్సీ – 36, బీసీ – 4, ఈబీసీ – 3, మైనారిటీ – 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వివరాలకు 8985740104, 95020 26080 నంబర్లలో సంప్రదించవచ్చు.


గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-23 ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి. అర్హులైన విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నవారు, 2022 మార్చిలో ఇంటర్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌..
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరాకి గాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఏప్రిల్ 29న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా, జనవరి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ జవహర్‌ నవోదయాలు దేశవ్యాప్తంగా 649 ఉన్నాయి. వీటిలో ఏపీలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. వీటన్నింటిలో దాదాపు 48 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. జేఎన్‌వీ ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌‌తోపాటు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు, కాలేజీలకు 'సంక్రాంతి' సెలవులివే! ఏపీలో ఇలా - తెలంగాణలో అలా!


మరిన్ని విద్యాసంబంధవార్తల కోసం క్లిక్ చేయండి..