TG CPGET Results: తెలంగాణలో వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం నిర్వహించే సీపీగె్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. తొమ్మిది యూనివర్శిటీల్లో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టులో పరీక్ష నిర్వహించారు. ఈ సీపీగెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ పరీక్షను 45వేల 477 మంది రాశారు. ఆయా యూనివర్శిటీల్లో ఉన్న సీట్ల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.
తొమ్మిది రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు కీలకమైన తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్ (TG CPGET) 2025 గత నెలలో విజయవంతంగా ముగిసింది, ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల కానున్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క అడ్మిషన్స్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4 నుండి 11 వరకు ఎనిమిది రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫార్మాట్‌ను ఉపయోగించాయి. మొత్తం 62,806 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకున్నారు, 40 పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాలు మరియు నాలుగు ఇంటిగ్రేటెడ్ ఐదేళ్ల ప్రోగ్రామ్‌లతో సహా 44 సబ్జెక్టులలో 54,695 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలు ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్ మరియు ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీలను కవర్ చేశాయి.
సీపీగెట్ ఫలితాలను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) రూపొందించిన వెబ్‌సైట్ https://cpget.tgche.ac.in/లో ఉంచారు. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్శిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆగస్టు ఆరు నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన, చాకలి ఐలమ్మ, కాకతీయ, జేఎన్టీయూల్లో దాదాపు 32 సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలను ఇవాళ విడుదల చేశారు.
సీపీగెట్ ఫలితాలు ఎలా చూడాలి: తెలంగాణలోని వివిధ యూనివర్శిటీల్లో పీజీ కోర్సులు చదవాలని భావించి పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://cpget.tgche.ac.in/ వెబ్‌సైట్‌లో చూడాలి.
ముందుగా https://cpget.tgche.ac.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అనే సెగ్మెంట్‌లో ర్యాంక్ కార్డు అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
తర్వాత మీకు ర్యాంకు కార్డుకు సంబంధించిన వివరాల పేజ్ ఓపెన్ అవుతుంది.
నేరుగా మీరు ర్యాంకు కార్డుకు సంబంధించిన లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ పేజ్‌లో CPGET Hallticket నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డు ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.తర్వాత మీరు మీ ర్యాంకు కార్డును ప్రింట్ తీసి పెట్టుకోవాలి. కౌన్సెలింగ్‌లో మీకు యూజ్ అవుతుంది.