TS 10th Class Supplementary Exams 2023: పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫీజును ఈ నెల 26వ తేదీలోపు చెల్లించాలని ఆదేశించింది.
పదోతరగతి ఫలితాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్ కోసం 500 రూపాయల ఫీజు చెల్లించి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్, డూప్లికేట్ క్వశ్చన్ పేపర్స్ కోసం ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చెల్లించాలి. స్కూల్ హెడ్‌మాస్టర్‌తో సంతకం చేయించిన దరఖాస్తులో హాల్‌టికెట్లు జతపరిచి డీఈవో ఆఫీస్‌కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మాత్రమే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. కొరియర్, పోస్టు చేసిన దరఖాస్తులు స్వీకరించేది లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. దరఖాస్తులను bse.telangana.gov.inలో ఉంచారు.
2022-23విద్యా సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత 3.85 శాతం అధికంగా ఉంది. 2023లో పదోతరగతి పరీక్ష రాసేందుకు 4,94,504 మంది రిజిస్టర్ చేసుకుంటే.. అందులో 4,91,862 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 4,84,370 మంది రెగ్యులర్ విద్యార్థులైతే... 7,492 మంది ప్రైవేట్ విద్యార్థులు. 2022లో 5,04,398 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.
తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ బడులు 72.39 శాతంతో తక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశాయి. కేజీబీవీ, ఎయిడెడ్, జడ్పీ, ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదు చేశాయి.
సబ్జెక్టలు వారీగా చూసుకుంటే...
ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 475197 మంది ఉత్తీర్ణత పొందారు. వీళ్ల ఉత్తీర్ణత శాతం 98.17. సెకండ్ లాంగ్వేజ్‌లో 481885 మంది అంటే 99.7 శాతం మంది పాస్ అయ్యారు. తృతీయ భాషలో 475843 మంది పాస్ అయ్యారు. మ్యాథ్స్‌లో 443743 మంది పాస్ అయ్యారు. సైన్స్‌లో 454708 మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్ సబ్జెక్టులో 478483 మంది పాస్ అయ్యారు.
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన శాతం-86.60 %
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన బాలురు శాతం-84.68 %
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన బాలికల శాతం- 88.53 %
బాలురు కంటే బాలికల పాస్ పర్సంటేజ్ 3.85 శాతం ఎక్కువ
తెలంగాణ టెన్త్ పరీక్షలకు హాజరైంది- 4,91,862
తెలంగాణ టెన్త్ పరీక్షలకు హాజరైన బాలురు-243186
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన బాలురు - 205930
తెలంగాణ టెన్త్ పరీక్షలకు హాజరైన బాలికలు-2,41,184
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన బాలికలు- 2,13,530
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న జిల్లా - నిర్మల్ జిల్లా (99%)
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉన్న జిల్లా -వికారాబాద్(59.46)
2793 స్కూల్స్‌లో వందకు వంద శాతం ఫలితాలు వస్తే.. 25 ప్రభుత్వం పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న జిల్లా - నిర్మల్ జిల్లా
తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉన్న జిల్లా -వికారాబాద్
తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి (How To Check TS SSC Results 2023)
Step 1: టెన్త్ క్లాస్ విద్యార్థులు మొదట ఏపీబీ ఇచ్చిన రిజల్ట్స్ లింక్‌ను క్లిక్ చేయండి
Step 2: వెంటనే మీకు హోం పేజీలో టీఎస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ (TS SSC Results 2023) లింక్ మీద క్లిక్ చేయండి
Step 3: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి
Step 4: వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి
Step 5: మీ స్క్రీన్ మీద విద్యార్థి 10వ తరగతి ఫలితాలు కనిపిస్తాయి. TS SSC Results 2023 Marks మెమోను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: డౌన్‌లోడ్ చేసుకున్న టెన్త్ రిజల్ట్ పీడీఎఫ్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం బెటర్.