తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. పదోతరగతి నుంచి ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో సెప్టెంబరు 12న భూదాన్ పోచంపల్లిలోని సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.


 


Also Read: NMAT 2022: మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మెరుగైన మార్గం 'ఎన్‌మాట్', దరఖాస్తు చేసుకోండి!




పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ..తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తారు. అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు ప్రారంభ వేతనంగా రూ.6000 - రూ.8000 వరకు ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల నుంచి ఏడాది కాలంలో నిబంధనల ప్రకారం వేతన పెంపు ఉంటుంది. టెలీకాలర్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు సంస్థ కేటాయించిన కంపెనీలో తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9133908000, 9133908111, 913390822, 9949466111 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

శిక్షణ కార్యక్రమాలు..


1) బేసిక్ కంప్యూటర్స్, ఇంగ్లిష్ 


కాలవ్యవధి: 2 నెలలు.



2) టెలీ కాలర్ 


 కాలవ్యవధి: 30 రోజులు.



అర్హత:
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. 



వయోపరిమితి:
18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 



ఎంపిక విధానం:
కౌన్సెలింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.


 


Also Read: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఒక్కరోజులోనే వీసా!




కౌన్సిలింగ్‌కు హాజరయ్యేవారు వెంట తీసుకురావాల్సినవి..


* విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు


* పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు


* ఆధార్ కార్డు, రేషన్ కార్డు



కౌన్సెలింగ్ తేది: 12.09.2022 ఉదయం 10 గంటలకు.



చిరునామా:

Swamy Ramananda Tirtha Rural Institute (SRTRI)
Jalalpur (V), Bhoodan Pochampally (M)
Yadadri Bhuvanagiri Dist. – 508 284.
Telangana State-India.



Website



Also Read:


APRCET-2022: ఏపీఆర్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాలు ఇలా!
ఏపీలోని 16 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2022 (ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 01న ప్రారంభమైంది. 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. ఏపీఆర్‌సెట్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 62 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..