తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు కీలక అలర్ట్.. ఇంటర్మీడియట్‌లో 60% అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షకు అనుమతించేందుకు ఇంటర్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. బోర్డు నిబంధనల ప్రకారం 75% హాజరు తప్పనిసరి. సరైన కారణాలతో ఏ విద్యార్థికైనా 60% - 75% వరకు హాజరు ఉంటే ప్రతిపాదనలు పంపాలని సంబంధిత ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు సూచించింది. విద్యార్థులు 10 రోజుల తక్కువ హాజరుకు రూ.1000, అదేవిధంగా 15 రోజుల వరకు రూ.1500, 15 రోజులు మించితే రూ.2 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, సెకండియర్ పరీక్షలు మార్చి 16న మొదలుకాగా, ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు :
- మార్చి 15 - బుధవారం - 2nd లంగ్వేజ్ పేపర్ 1
- మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లీష్ పేపర్ 1
- మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్ పేపర్ 1ఎ, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
- మార్చి 23 - గురువారం - మ్యాథ్స్ 1బి, హిస్టరీ పేపర్ 1, జువాలజీ పేపర్ 1
- మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్ 1, ఎకనావిుక్స్ పేపర్ 1
- మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
- మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)
- ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ :
- మార్చి 16 - గురువారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మార్చి 18 - శనివారం - ఇంగ్లీష్ పేపర్ 2
- మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్ పేపర్ 2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
- మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేసర్ 2బి, హిస్టరీ పేపర్ 2, జువాలజీ పేపర్ 2
- మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్ 2, ఎకనావిుక్స్ పేపర్ 2
- మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2
- ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 2 (బైపీసీ విద్యార్థులకు)
- ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2
Also Read:
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపికలు ఉంటాయి.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..