చెన్నైలోని ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- 2024 విద్యా సంవత్సరానికి ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా యూజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్‌ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్/ బోటనీ/ జువాలజీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫేజ్ 1 ఏప్రిల్ 13, ఫేజ్ 2 జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 (యూజీ)
యూజీ కోర్సులు: బీఈ, బీటెక్
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్‌ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్/ బోటనీ/ జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12వ బోర్డు పరీక్ష జరిగే క్యాలెండర్ సంవత్సరంలో జూలై 31 నాటికి 16 సంవత్సరాల 6 నెలల వయస్సు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
SRMJEEE 2024 - పరీక్షా విధానం: మొత్తం 125 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం: 2.30 గంటలు.
⏩ ప్రశ్నల సంఖ్య - 125
⏩ భౌతికశాస్త్రం - 35
⏩ కెమిస్ట్రీ - 35
⏩ గణితం / జీవశాస్త్రం – 40
⏩ ఆప్టిట్యూడ్ - 10
⏩ ఇంగ్లీష్ - 5
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ (ఫేజ్ 1): 13.04.2024.
➥ అడ్మిట్ కార్డుల విడుదల తేదీ: ఏప్రిల్ 3వ వారం 2024.
➥ ఫేజ్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ: 19, 20, 21.04.2024.
➥ డిక్లరేషన్ ప్రకటన: ఏప్రిల్ 4వ వారం 2024.
➥ కౌన్సెలింగ్ ప్రారంభం: జనవరి 4వ వారం 2024.
➥ తరగతుల ప్రారంభం: ప్రకటించబడవలసి ఉంది
➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ (ఫేజ్ 2): 15.06.2024.
➥ అడ్మిట్ కార్డుల విడుదల తేదీ: జూన్ 3వ వారం 2024.
➥ ఫేజ్ 2 మెయిన్స్ పరీక్ష తేదీ: 21, 22, 23.06.2024.
➥ డిక్లరేషన్ ప్రకటన: జూలై 1వ వారం 2024.
➥ కౌన్సెలింగ్ ప్రారంభం: ఆగస్టు 2024.
➥ తరగతుల ప్రారంభం: ఆగస్టు 2024.
SRMJEEE UG Model Question Paper
ALSO READ:
విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు 'వీశాట్-2024' నోటిఫికేషన్ విడుదల
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాలు కోరువారు ఆయా క్యాంపస్‌ల్లో దరఖాస్తులు పొందవచ్చు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు కూడా ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. విశాట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..