AP PGECET 2024 Halltickets: ఆంధ్రప్రదేశ్‌‌లోని పీజీ కళాశాలల్లో  ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024' పరీక్ష హాల్‌టికెట్లను శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి మే 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ, ఎగ్జామ్ పేపర్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఏపీ పీజీఈసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి 31 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 13 సబ్జెక్టులకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను మే 31 నుంచి జూన్ 2 వరకు సబ్జెక్టులవారీగా తేదీలవారీగా విడుదల చేస్తారు. అనంతరం జూన్ 2 నుంచి 4 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం జూన్ 8న ఫలితాలను వెల్లడించనున్నారు.


పరీక్షల షెడ్యూలు ఇలా..


మే 29న:
ఉదయం: జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్‌ఫర్మాటిక్స్, ఫార్మసీ.
మధ్యాహ్నం: కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ.


మే 30న:
ఉదయం: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్.
మధ్యాహ్నం: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ.


మే 31న:
ఉదయం: ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్.
మధ్యాహ్నం: నానో టెక్నాలజీ.


పరీక్ష విధానం.. 
మొత్తం  120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. 


పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, తిరుపతి, గూడురు(తిరుపతి), రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నర్సారావుపేట, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, భీమవరం (పశ్చిమగోదావరి), కడప, హైదరాబాద్.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024(AP PGECET) నోటిఫికేషన్‌ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 23న ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల నుంచి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 5 వరకు.. చివరగా రూ.5000 ఆలస్య రుసుముతో  మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల సవరణకు మే 8 నుంచి 14 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి మే 29 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన  హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేశారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..