ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఉద్యానవన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు 'హార్టిసెట్‌-2023' నోటిపికేషన్ విడుదల చేసింది. హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా(పాలిటెక్నిక్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ ఆనర్స్‌ (హార్టికల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు నవంబరు 28లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు పరిశీలన తర్వాత, ప్రవేశపరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది. అర్హులైన అభ్యర్థుల జాబితాను హాల్‌టికెట్ నెంబరుతో సహా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అర్హులైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్‌టికెట్ మీద ఫొటోగ్రాఫ్ అతికించి, పరీక్ష రోజు హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. నిర్ణీత గడువులోగా అడ్మిట్‌కార్డులు పొందలేనివారు పరీక్షరోజు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ను సంప్రదించి డూప్లికేట్ హాల్‌టికెట్‌ పొందవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ దరఖాస్తుకు అవకాశం ఉండదు.


వివరాలు..


* శ్రీకొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ హార్టిసెట్‌ - 2023.


కోర్సు: బీఎస్సీ ఆనర్స్‌ (హార్టికల్చర్)


సీట్లు: 32. ఇందులో 85 శాతం (27) సీట్లను లోకల్ అభ్యర్థులకు, మిగిలి 15 శాతం సీట్లను ఇతరులకు కేటాయిస్తారు. 


వ్యవధి: నాలుగేళ్లు.


అర్హత: శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్‌ డిప్లొమా (పాలిటెక్నిక్‌)ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 31,12.2023 నాటికి 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: హార్టిసెట్ ప్రవేశ పరీక్ష ఆధారంగా. అయితే హార్టిసెట్ ర్యాంకుకు 75 %, డిప్లొమా మార్కులకు 25% వెయిటేజీ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. డిప్లొమా సిలబస్ ఆధారంగానే పరీక్ష ఉంటుంది. మల్టీపుల్ ఛాయిస్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు.


దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.350 చెల్లించాలి. 'The Comptroller, SKLTSHU, Mulugu, Siddipet పేరిట డిడి తీయాలి.  


చిరునామా: 
The Registrar, 
Sri Konda Laxman Telangana State Horticultural University,
Administrative Building, Mulugu (Vill. & Mdl.), 
Siddipet District - 502279.
Telangana State.


ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 05.11.2023.


➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2023.


➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.11.2023.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 25.11.2023.


➥ ప్రవేశ పరీక్షతేది: 28.11.2023.


➥ పరీక్ష సమయం: ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు.


పరీక్ష కేంద్రం: 
Administrative Building, 
Sri Konda Laxman Telangana State Horticultural University, 
Mulugu, Siddipet –502279.


SKLTSHU HortiCET 2023 Notification


SKLTSHU HortiCET 2023 Application Form


SKLTSHU HortiCET 2023 Schedule


ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు..
హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్‌ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌‌డీ ప్రవేశాలకు సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆలస్యరుసుముతో నవంబరు 22 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించారు.
కోర్సులవివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...