కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన ‘సిల్వర్ సెట్-2023’ ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 17న విడుదలయ్యాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. దీనిద్వారా వివిధ డిగ్రీ కోర్సు(ఇంగ్లిష్ మీడియం)ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష మే 25న నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంపికైన విద్యార్థులకు ఉచిత బోధన, భోజన, వసతి, శిక్షణ అందుతుంది.
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7 నుంచి మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 25న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు.
Also Read:
'అమ్మఒడి' డబ్బులు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడు జమచేస్తారంటే?
ఏపీలో 'జగనన్న అమ్మఒడి' పథకం నిధులను జూన్ 28న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23వ సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ.12,000; గ్రామాల్లో రూ.10,000 లోపు ఉండాలి. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15,000 నుంచి పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2,000 మినహాయించి, మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నిరుద్యోగ యువతకు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత ఉపాధి శిక్షణ, టెన్త్ అర్హత చాలు!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు నిర్మాణ్, ఇన్‌వెస్కో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు సీనియర్ మేనేజర్ శ్రీనివాస్‌యాదవ్ జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండి, వయసు 18-30 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ యువత దరఖాస్తుకు అర్హులని తెలిపారు. ఎంపికైనవారికి జావా, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌సీ, బూట్స్ ట్రాప్, పీహెచ్‌పీ, ఎంఎస్ ఆఫీస్, టాలీ ప్రైమ్, సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ పేర్ల నమోదుకు 94946 09001, 91009 81632 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సింగరేణి కాలరీస్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ, అర్హత వివరాలు ఇలా!
తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..