School holidays in AP and Telangana States: తెలుగు రాష్ట్రల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వచ్చేవారం వరుస సెలవులు వస్తుండటంతో కోలాహలం నెలకొంది. విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండనున్నాయి. వచ్చేవారారంతంలో కేవలం ఒక్కరోజు సొంతంగా సెలవు తీసుకుంటే మాత్రం.. ఏకంగా 5 రోజులపాటు వరుస సెలవులు రానున్నాయి. వచ్చేవారంలో ఆగస్టు 15 గురువారం స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న శ్రావణమాసం తొలి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 18న ఆదివారం ఎలాగూ సెలవుదినమే. ఇక ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆరోజు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. మధ్యలో ఆగస్టు 17 శనివారం ఒక్కరోజు మాత్రమే పనిదినంగా వచ్చింది. స్కూళ్లు, కాలేజీలు, కొన్ని సంస్థలకు మాత్రమే ఈ సెలవులు వర్తించనున్నాయి. ఎలాగూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు శనివారం ఎలాగు వీకెండ్‌ ఉంది. ఆగస్టు 15, 16, 18, 19 తేదీల్లో సెలవులు ఉన్నాయి. మధ్యలో ఆగస్టు 17 (శనివారం) ఒక్క రోజు మాత్రమే వర్కింగ్ డే ఉంటుంది.  ఈ ఒక్కరోజు ఏదోరకంగా సెలవు తీసుకుంటే.. ఏకంగా 5 రోజుల వరుసు సెలవులు రానున్నాయి.  


ఆగస్టులో ఇతర సెలవులు ఇలా..


➥ ఆగస్టు 10న రెండో శనివారం ఎలాగూ పాఠశాలలకు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉండనుంది. బ్యాంకు ఉద్యోగులకు ఆగ‌స్టు 24న నాలుగో శ‌నివారం కూడా సెలవు వస్తుంది. 


➥ ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజు సెలవు ప్రకటించే అవ‌కాశం ఉంది. ప్రపంచ దేశాలు, కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్పటికే ఆగస్టు 9న సెలవు ప్రకటించాయి. తెలంగాణలోనూ ఆగ‌స్టు 9న సెలవు ఇవ్వాల‌ని మంత్రి సీత‌క్క సీఎంకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.


➥ ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉంది. ఈ రోజు కూడా సెలవు ఉంటుంది. 


మొత్తంగా చూస్తే ఆగస్టు నెలలో స్కూల్స్‌, కాలేజీల‌కు 10 రోజుల వ‌ర‌కు సెల‌వులు రానున్నాయి. అయితే విద్యార్థులు నివసిస్తున్న రాష్ట్రం లేదా ప్రాంతం, పాఠశాలను బట్టి పైన పేర్కొన్న కొన్ని సెలవులు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. సెలవుల గురించి పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవచ్చు. 


తెలంగాణలో విద్యాసంవత్సరం సెలవులు..
➥ తెలంగాణలో ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి.
➥  సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయని వెల్లడించింది. 
➥ అక్టోబరు 31న దీపావళి
➥ డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు ఉండనున్నాయి.


ఏపీలో విద్యాసంవత్సరం సెలవులు..
➥ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➥  క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➥ అక్టోబరు 31న దీపావళి
➥ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు. 
➥ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.
➥ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..