Sankranthi Holidays 2023: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ఇవే! ఈ సారి ఎన్నిరోజులంటే?

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. తెలంగాణలో 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో సంక్రాంతి సెలవుల గురించి ముందుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. 

Continues below advertisement

ఏపీలోని జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇక తెలంగాణలో 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఇంటర్ కాలేజీలకు ఇవే సెలవులు దినాలు ఉండే అవకాశం ఉంది. 

జనవరి నెలలో సాధారణ సెలవులివే!

➥ జనవరి నెల‌లో భారీగా సెలవులు రానున్నాయి. సాధారణ సెలవుల్లో జనవరి 1వ తేదీని ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1న‌ ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది.

➥ ఇక జనవరి నెల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు. భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.

➥ ఇంకా భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. 

➥ ఆదివారాలు, రెండో శనివారం కలిపితే జనవరిలో బోలెడు సెలవులు వస్తాయి. ఆయా తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి.

➥ రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన‌ గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.

➥ జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.

Also Read:

ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే!
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబరు 26న ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ తాజాగా విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని బోర్డ్ వెల్లడించింది.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement