తెలంగాణలో 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటుచేయనున్నారు. పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ) పథకం కింద పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతుల కోసం నిధులు ఖర్చు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం ఒక్కో పాఠశాలకు రూ.16 లక్షల చొప్పున రూ.44.64 కోట్ల విడుదలకు అనుమతులు మంజూరయ్యాయి. మరో 114 పాఠశాలల్లో 252 అదనపు తరగతి గదులను నిర్మిస్తారు. అందుకు రూ.40.32 కోట్ల వ్యయానికి పాఠశాల విద్యాశాఖ అనుమతిచ్చింది. మరో 205 పాఠశాలల్లో మరమ్మతులకు రూ.9.22 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నింటినీ తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చేపట్టనుంది. పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు.


పీఎంశ్రీ పథకానికి తెలుగు రాష్ట్రాల నుంచి 1205 పాఠశాలలు ఎంపిక..
ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ పాఠశాలల) పథకంలో భాగంగా తొలి విడతలో దేశవ్యాప్తంగా మొత్తం 6,448 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఏపీ నుంచి 623 పాఠశాలలు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి 543 పాఠశాలలు ఉన్నాయి. ఏపీ నుంచి ఎంపికైన వాటిలో 33 ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా, 629 సెకండరీ/సీనియర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ఎంపికైన వాటిలో 56 ఎలిమెంటరీ పాఠశాలలు కాగా, 487 సెకండరీ/సీనియర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. సమానత, అందుబాటు, నాణ్యత, ఇన్‌క్లూజన్‌తో సహా అన్నిస్థాయిల్లో విద్యార్థులు సంపూర్ణమైన అభివృద్ధి సాధించేందుకు ఈ స్కూళ్లు తోడ్పాటునందించనున్నాయి.


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) రెండో విడత దరఖాస్తు గడువు ఆగ‌స్టు 26తో ముగిసింది. రెండో విడతకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 4,930 పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎంపికైన పాఠశాలలను జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేస్తారు.


ALSO READ:


ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌, ఈ ఏడాది నుంచే అమలు
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్‌ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు నిర్ణీత నమూనాలో రూ.200 విలువచేసే నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్‌టేకింగ్ ఇవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...