ఏపీలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి 'ఫేజ్-3' కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా నవంబర్ 23న విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో కేటగిరీలవారీగా ఎంపిక జాబితాలను అందుబాటులో ఉంచారు. వీటిలో అన్ని (జనరల్, ఓహెచ్, క్యాప్, ఎన్‌సీసీ) కేటగిరీల కింద మొత్తం 125 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 125 సీట్ల భర్తీకి నవంబరు 27న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.


ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కటాఫ్ మార్కులు ఇలా..


కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


నాలుగు ట్రిపుల్ ఐటీల్లో జనరల్ కోటాలో 120, ఎన్‌సీసీలో 3, సీఏపీలో 1, ఓహెచ్ కోటా కింద 1 సీట్లు... మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం 125 సీట్లు మిగిలిపోయాయి. ఎన్‌సీసీ, క్యాప్, ఓహెచ్ కోటా సీట్లు సైతం నవంబర్ 27న భర్తీ చేయనున్నారు. క్యాంపస్‌ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఫేజ్ 4 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సందేహాల పరిష్కారానికి స్పెషల్ హెల్ప్ డెస్క్
నవంబరు 14 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ కోసం హాజరయ్యే విద్యార్థుల సౌకార్యార్థం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్లు 97035 42597, 97054 72597 లేదా ఈమెయిల్ email to admissions@rgukt.in ద్వారా సంప్రదించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. కాల్ లెటర్‌లో RGUKT అప్లికేషన్ నెంబరు, పేరు, పదోతరగతి హాల్‌టికెట్ నెంబర్, ఫోన్ నెంబరు లాంటి వివరాల్లో సందేహాలుంటే సరిచేసుకోవచ్చు.



Also Read:


ఏపీలో పదోతరగతి ఫీజు చెల్లింపు గడువు ఇదే! ఫీజు వివరాలు ఇలా!
ఏపీలో పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును డిసెంబరు 10 వరకు పొడిగించారు. అయితే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబరు 30 వరకు అవకాశం కల్పించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా డిసెంబరు 10లోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.50 ఆలస్యరుసుముతో డిసెంబరు 12 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు పరీక్ష ఫీజు, దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యార్థులు ఫీజు మినహాయింపు కోసం రూ.650 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పదోతరగతి పరీక్ష ఫీజు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆంధ్రా యూనివర్సిటీలో ఆడియో, మ్యూజిక్ కోర్సులు - వివరాలివే!
ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆడియో, మ్యూజిక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 6 నెలల, ఏడాది, రెండేళ్ల కాలపరిమితిలో వోకల్ ట్రైనింగ్, ఇన్‌స్ట్రుమెంట్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..