ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి రెండో విడత(ఫేజ్-2) అర్హులైన అభ్యర్థుల జాబితా అక్టోబర్ 26న విడుదలైంది. రెండోదశ అడ్మిషన్స్‌ కౌన్సిలింగ్‌ కోసం 446 జనరల్‌ కేటగిరీ సీట్లకు గాను, 14 స్పెషల్‌ కేటగిరీ సీట్లకు గాను జాబితాను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన విద్యార్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. 


ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. ఎంపికైన జనరల్, స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు అక్టోబర్ 31న నూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్జీయూకేటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫేజ్ 2 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదటి దఫాలో ఎంపికైన విద్యార్థులకు అక్టోబర్ 17 నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి.


డైరెక్ట్ లింక్స్ ఇవే..


 Phase 2 - Provisional Selection List for General Category for all Campuses


 Phase 2 - Provisional Selection List for Special Category (CAP, PH, BSG) for all Campuses


 Download call letter for Provisionally selected candidates in Phase 2 Counselling


 Download call letter for Provisionally selected candidates under Global Category (Otherthan AP & TS) for All Campuses


 Campus changed candidates list in Phase-2 Counselling, who already admitted in Phase-1 Counselling


 Download Campus Change order for Campus changed candidates list in Phase-2 Counselling 


 


:: ఇవీ చదవండి ::


సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!
దేశంలోని సైనిక పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023 ద్వారా జరుగుతాయి.
నోటిఫికేషన్, సీట్ల వివరాల కోసం క్లిక్ చేయండి.



DOST Counselling: 'దోస్త్‌' స్పెషల్ కౌన్సెలింగ్, డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం!

ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబరు 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు. ఇప్పటివరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



TS EAMCET: ఎంసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 15,447 సీట్లు ఖాళీనే!!

తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబరు 25తో పూర్తయింది. కన్వీనర్ కోటాలో 79,346 బీటెక్ సీట్లకుగాను 63,899 మంది సీట్లు పొందారు. సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి.  అయితే సీట్లు పొందినవారిలో కళాశాలతో చేరే వారి సంఖ్య 55 వేలకు మించదని ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆ ప్రకారం చూస్తే కన్వీనర్ కోటాలోనే దాదాపు 24 వేల బీటెక్ సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది.
సీట్లకేటాయింపు, మిగిలిపోయిన సీట్ల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..