తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (పీఎస్‌టీయూ సెట్) కొత్త షెడ్యూలును వర్సిటీ అధికారులు జులై 31న ప్రకటించారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఆరు కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 8, 9 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఇటీవల డౌన్‌లోడ్ చేసుకున్న పాత హాల్‌టికెట్లతోనే ప్రవేశ పరీక్షకు హాజరు కావొచ్చని తెలిపారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని అధికారులు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 27,28 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్షల షెడ్యూలు ఇలా..
* ఆగస్టు 8న నిర్వహించే పరీక్షలు
సబ్జెక్టులు-సమయం: ఎంఏ కమ్యూనికేషన్ & జర్నలిజం (ఉ.11 గం - మ.12.30 గం.), ఎంఏ జ్యోతిషం (మ.2 గం.- సా.3.30 గం.), బీఎఫ్‌ఏ (సా.4 గం.- సా.5.00 గం.)
పరీక్ష కేంద్రం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదరాబాద్.
* ఆగస్టు 9న నిర్వహించే పరీక్షలు
సబ్జెక్టులు-సమయం: ఎంఏ తెలుగు (ఉ.11 గం - మ.12.30 గం.), ఎంఏ హిస్టరీ, కల్చర్ & టూరిజం (మ.2 గం.- సా.3.30 గం.), బీఎల్‌ఎస్సీ (సా.4 గం.- సా.5.00 గం.)
పరీక్ష కేంద్రం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదరాబాద్.
ALSO READ:
APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో బీఎఫ్‌ఎస్‌సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్‌యూ) క్యాంప్ ఆఫీస్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్ 2023 ర్యాంక్ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 07వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
నల్సార్ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నిమ్స్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యాసంవత్సరానికి జెనెటిక్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/ బీఈ, బీటెక్ (బయోటెక్నాలజీ/ జెనెటిక్ ఇంజినీరింగ్/ బయోమెడికల్ ఇంజినీరింగ్/ బయోలాజికల్ సైన్సెస్) లేదా ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణత దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 09 వరకు దరఖాస్తు హార్డ్ కాపీలు సమర్పించవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..