హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్, సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల్లో పలు విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 11 నుంచి డిసెంబరు 1 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 


* డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్    


సీట్ల సంఖ్య: 41


1) పీహెచ్‌డీ (అగ్రికల్చర్): 31 సీట్లు


సబ్జెక్టులవారీగా ఖాళీలు: ఆగ్రోనమీ - 06,  అగ్రికల్చరల్ ఎకనామిక్స్ - 03, ఎంటోమాలజీ -04, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ - 05, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ - 06. ప్లాంట్ పాథాలజీ - 02, సాయిల్ సైన్స్ - 05, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - 02.


2) పీహెచ్‌డీ (కమ్యూనిటీ సైన్స్): 08 సీట్లు


సబ్జెక్టులవారీగా ఖాళీలు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్ - 07, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ - 02.


3) పీహెచ్‌డీ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్): 02 సీట్లు


సబ్జెక్టులవారీగా ఖాళీలు: సాయిల్ & వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్ - 01, ఫార్మ్ మెషినరీ &  పవర్ ఇంజినీరింగ్ - 01.


అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 31.12.2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.1800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. 


ఎంపిక ప్రక్రియ: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్-2022 స్కోరు, బీఎస్సీ, ఎంఎస్సీలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా.



ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.11.2022. 


🔰 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 01.12.2022.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 03.12.2022.


🔰 దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.12.2022 - 05.12.2022.


Notification


Online Application


Website


Also Read:


ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో బీటెక్‌, బీఎస్సీ స్పాట్ ప్రవేశాలు - 15న కౌన్సెలింగ్!
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఎంపీసీ స్ట్రీమ్ కింద బీటెక్, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు వాక్ ఇన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. దీనిద్వారా హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్‌లోని వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 15న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, అడ్మిషన్ వివరాల కోసం క్లిక్ చేయండి.


ఎన్టీఆర్‌ ట్రస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్, దరఖాస్తు ఇలా!
ఎన్టీఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకారవేతనం అందించనున్నట్లు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. దీనికి ఈ ఏడాది డిసెంబరు 4న 'గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ -2023)' పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదోతరగతి చదివే బాలికలు ఈ పరీక్ష రాయడానికి అర్హులని.. మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఇంటర్ పూర్తయ్యేవరకూ ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబరు 11 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 76600 02627/28 నంబర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.
నోటిఫికేషన్, అడ్మిషన్ వివరాల కోసం క్లిక్ చేయండి.


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..