హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.


ప్రవేశాలు కోరువారు జూన్ 3 నుంచి 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలలో SMS లేదా వాట్సాప్ ద్వారా తరగతులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ఫొటో, ఒరిజినల్ సర్టిఫికేట్ల స్కానింగ్ కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


పీహెచ్‌డీ ప్రవేశాలు..
తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. భాషాశాస్త్రం, సంగీతరం, నృత్యం, రంగస్థలం, జానపదం, జర్నలిజం, చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రం, జానపద గిరిజన విజ్ఞానం అంశాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు.


కోర్సుల వివరాలు..


1) డిగ్రీ కోర్సులు


2) పీజీ కోర్సులు


3) పీజీ డిప్లొమా కోర్సులు


4) డిప్లొమా కోర్సులు


5) సర్టిఫికేట్ కోర్సులు


6) పీహెచ్‌డీ ప్రవేశాలు


విభాగాలు: శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.06.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.06.2023.


➥ ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 30.06.2023.


Notification




Also Read:


ఏపీలో జూన్‌ 2 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
ఏపీలో పదోతరగతి అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 2 నుంచి 10 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.
పరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!
తెలంగాణలో హెచ్‌ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌ కోర్సు చదివే అవకాశం రాబోతుంది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ పేరుతో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్స్‌ (సీహెచ్‌డీ) కోర్సులు అందిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ అంటే ఇంజినీరింగ్‌తోపాటు మరో ఏడాది మాస్టర్‌ థీసిస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు ట్రిపుల్‌ఐటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌‌లో మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన వారు 90 శాతం మార్కులు, హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులు 85 శాతం మార్కులు కలిగి ఉండాలి. వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ వచ్చిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తారు. వీరు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..