Potti Sreeramulu Telugu University Admission Notification 2024-25: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2024-25 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాలు ఆగస్టు 9లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక రూ.100 ఆలస్య రుసుముతో ఆగస్టు 19 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలలో SMS లేదా వాట్సాప్ ద్వారా తరగతులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ఫొటో, ఒరిజినల్ సర్టిఫికేట్ల స్కానింగ్ కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


ప్రవేశాలు తెలంగాణకే పరిమితం..
తెలుగు రాష్ట్రాల మధ్య 10 సంవత్సరాలపాటు కొనసాగిన హైదరాబాద్ 'ఉమ్మడి రాజధాని' బంధానికి జూన్‌ 2తో తెరపడిన సంగతి తెలిసిందే. దీంతో విద్యాసంస్థల్లోనూ ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఇకపై కేవలం తెలంగాణకే పరిమితం కానుంది. అయితే ఈ ఏడాది కూడా మీరే ప్రవేశాలు తీసుకోవాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు వర్సిటీకి లేఖ రాసింది. ఈ లేఖ తెలంగాణ రాష్ట్ర ఉన్నత శాఖ పరిశీలించి, జీఏడీకి, ఆ తర్వాత రాష్ట్ర పునర్‌ విభజన కమిటీ అడిటర్‌ జనరల్‌ పరిశీలనకు పంపించారు. అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడంతో విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కేవలం తెలంగాణకే ప్రవేశాలను పరిమితం చేస్తూ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 


కోర్సుల వివరాలు..


➥ డిగ్రీ కోర్సులు



  • బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (B.FA)- శిల్పం/చిత్రలేఖనం/ప్రింట్ మేకింగ్ 

  • మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (B.FA)- శిల్పం/చిత్రలేఖనం/ప్రింట్ మేకింగ్ 

  • ‌బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడక్ట్ 

  • ‌బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్

  • ‌బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్

  • ‌బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్ డిజైన్


➥ పీజీ డిగ్రీ కోర్సులు



  • ఎంఏ హిస్టరీ, కల్చర్ & టూరిజం

  • ఎంఏ అనువర్తిత భాషాశాస్త్రం

  • ఎంఏ కమ్యూనికేషన్ & జర్నలిజం

  • ఎంఏ జ్యోతిషం

  • ఎంఏ కర్ణాటక సంగీతం (గాత్రం, మృదంగం, వీణ, వయోలిన్)

  • ఎంఏ కూచిపూడి నృత్యం/ఆంధ్రనాట్యం

  • ఎంపీఏ రంగస్థల కళలు

  • ఎంఏ తెలుగు (హైదరాబాద్, వరంగల్ ప్రాంగణం)


➥ పీజీ డిప్లొమా 



  • జ్యోతిర్వాస్తు

  • యోగా

  • డిక్షనరీ మేకింగ్ 

  • తెలుగు లాంగ్వేజ్ టీచింగ్ 

  • ఫిల్మ్ డైరెక్షన్


➥ డిప్లొమా 



  • జ్యోతిష్యం

  • లతిత సంగీతం

  • పద్యనాటకం

  • మిమిక్రీ

  • ఇంద్రజాలం (మేజిక్)


➥ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ 



  • జ్యోతిష్యం

  • యానిమేషన్ & VFX

  • స్టిచ్చింగ్ & టైలరింగ్ 

  • ఫొటోగ్రఫీ & వీడియో 


అర్హతలు: కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా. అయితే నిర్ణీత సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చే కోర్సుల్లో ప్రవేశ పరీక్ష లేకుండానే మార్కుల ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు. ఇక సాయంకాలం కోర్సులకు ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలకు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో కనీసం అర్హత మార్కులను 36 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 15 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఏదైనా కోర్సుకు దరఖాస్తుల సంఖ్య 15 కంటే తక్కువగా వస్తే.. ఆ కోర్సును నిర్వహించరు. ఇక ప్రదర్శక కళల కోర్సులకు 50 మార్కులకు థియరీతోపాటు, 50 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. ఒక్కోదాంట్లో 18 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.500.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.08.2024.


➥ రూ.100 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 19.08.2024.


Notification


Online Application


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..