Telugu University Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

ప్రవేశాలు కోరువారు డిసెంబరు 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.  

Continues below advertisement

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబరు 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాలు కోరువారు డిసెంబరు 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలలో SMS లేదా వాట్సాప్ ద్వారా తరగతులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ఫొటో, ఒరిజినల్ సర్టిఫికేట్ల స్కానింగ్ కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Continues below advertisement

కోర్సుల వివరాలు..

1) పీజీ డిప్లొమా కోర్సులు

విభాగాలు: టెలివిజన్ జర్నలిజం, జ్యోతిర్వాస్తు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.

2) డిప్లొమా కోర్సులు

విభాగాలు: ఫిల్మ్ రైటింగ్, జ్యోతిషం, లైట్ మ్యూజిక్ (లలిత సంగీతం).

అర్హత: 

➥ ఫిల్మ్ రైటింగ్ కోర్సుకు పదోతరగతి ఉండాలి.

➥ జ్యోతిషం కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ మ్యూజిక్ కోర్సుకు చదవడం, రాయడం తెలిసి ఉండాలి. లలిత సంగీతం పట్ల ఆసక్తి ఉండాలి.

3) సర్టిఫికేట్ కోర్సులు

విభాగాలు: జ్యోతిషం, సంగీత విశారద, మోడర్న్ తెలుగు (ఆధునిక తెలుగు).

అర్హత: 

➥ జ్యోతిషం సర్టిఫికేట్ కోర్సుకు పదోతరగతి విద్యార్హత కలిగి ఉండాలి.

➥ మోడర్న్ తెలుగు సర్టిఫికేట్ కోర్సుకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మొదటి నుంచి ఇంగ్లిష్ మీడియం చదివినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

➥సంగీత విశారద కోర్సుకు 12 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులు. విద్యార్హతలతో సంబంధంలేదు.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: యూనివర్సిటీ నిబంధనల మేరకు.

దరఖాస్తు ఫీజు: రూ.300.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.12.2022 - 28.02.2023

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.02.2023.

➥ రూ.200 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 31.03.2023

CDE Notification

CDE Prospectus 2022-23

Online Application

Website 

Also Read:

KU Degree Exams: కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ షెడ్యూలు విడుదల, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
కాకతీయ విశ్వవిద్యాలయం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిసెంబరు 28 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. పరీక్షల రీషెడ్డ్యూల్‌ను డిసెంబరు 27న వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా.పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.జె.మధుకర్, డా.ఎ.నరేందర్ విడుదల చేశారు. దీనిప్రకారం జనవరి 4 నుంచి ఐదో సెమిస్టర్, 5 నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక డిగ్రీ ఒకేషనల్ మూడో సెమిస్టర్ పరీక్షలు జనవరి 10 నుంచి, ఐదో సెమిస్టర్ పరీక్షలు జనవరి 6 నుంచి ప్రారంభంకానున్నాయి.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

AP LAWCET Web Options: ఏపీ లాసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలోని న్యాయకళాశాలల్లో లాసెట్‌ ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ డిసెంబరు 28న ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబరు 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు మార్చుకోదలచిన వారికి డిసెంబరు 31న అవకాశం కల్పిస్తారు. అభ్యర్థులకు జనవరి 2న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి 3 నుంచి 7 వరకు సంబంధిత కళాశాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జనవరి 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
వెబ్ఆప్షన్ల నమోదు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement