కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం యశస్వి’ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ దరఖాస్తు గడువు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు ఆగస్టు 11న ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 30 వేల స్కాలర్‌షిప్స్‌ కోసం ఎన్‌టీఏ యశస్వి (యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డు స్కీమ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా) పరీక్ష-2023 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Continues below advertisement


యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం. ఈ  పరీక్షలో మెరిట్ ఆధారంగా ఉపకారవేతనాలకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం 9, 11 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సదరు విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించరాదు. 


ప్రవేశ పరీక్షలో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు చెల్లించేలా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని ఒకేసారి జమచేస్తారు. 9, 10 తరగతులకు గాను ఏడాదికి రూ.75వేలు చొప్పున, అలాగే, 11, 12 తరగతులకు రూ.1,25,000 చొప్పున ఉపకారవేతనాలుగా చెల్లిస్తారు. 


అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి లేదా పదకొండో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించని తల్లిదండ్రుల విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎంపిక విధానం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా అందిస్తున్న ‘YASASVI 2023’ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవిద్యార్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (MCQ ఫార్మాట్) ఆధారంగా ఎంపిక చేస్తారు. 


తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, అమరావతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం.


పరీక్ష విధానం: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బహుళైచ్చిక ప్రశ్నలుంటాయి. వ్యవధి 3 గంటలు. గణితం, సైన్స్, సోషల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్/ నాలెడ్జ్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలుంటాయి. ప్రశ్నల సంఖ్య 100, ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది.


ఎలా దరఖాస్తు చేయాలి?


➥ దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ yet.nta.ac.inని సందర్శించండి.


➥ దీని తర్వాత వెబ్‌సైట్‌లో ఇచ్చిన రిజిస్టర్ లింక్‌పై క్లిక్ చేయండి.


➥ ఇప్పుడు పేరు, ఇమెయిల్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్ మొదలైన వాటిని నమోదు చేసి అకౌంట్‌ను సృష్టించండి.


➥ ఇప్పుడు అప్లికేషన్ నంబర్ పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి.


➥ ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, సమర్పించండి.


➥ వీలైతే, దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత, అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ తీసుకోండి.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.07.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.08.2023 (17.08.2023 వరకు పొడిగించారు)


➥ దరఖాస్తు సవరణలకు అవకాశం: 27.08.2022 నుంచి 31.08.2022 వరకు.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేది: 05.09.2022 నుంచి.


➥ పరీక్ష తేది: 29.09.2022.


Notification


Online Application