పాఠశాలలో పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం కోసం ఉపాధ్యాయులు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు టీచర్లు తరగతినే ప్రయోగశాలగా మార్చేస్తుంటారు. అలాంటి ఓ ఫిజిక్స్ టీచర్ కూడా తరగతిలో పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం కోసం తరగతినే ప్రయోగశాలగా మార్చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ వివరాలంటే మీరు ఓ లుక్కేయండి...!
ఓ ఫిజిక్స్ టీచరు తరగతిలో వక్రీభవనం గురించి పిల్లలకు చిన్న ప్రయోగం ద్వారా వివరించాలి అనుకున్నాడు. గాలి, గ్లాస్.. ఈ రెండింటికి వక్రీభవనం గుణకం వేరుగా ఉంటుందని చెప్పడం కోసం.. రెండు గ్లాస్‌లు, వంటనూనె డబ్బా తీసుకొని క్లాస్‌రూమ్‌కి వెళ్లాడు. ముందుగా బ్లాక్ బోర్డ్ మీద బొమ్మలు గీసి పిల్లలకు వక్రీభవనం పాఠం చెప్పాడు. ఆ తర్వాత ఒక గ్లాస్‌లో ముప్పావు వంతు వరకు వంటనూనె పోశాడు. ఆ గ్లాస్‌ని చేతిలో పట్టుకుని పిల్లలకు చూపించాడు. నూనె ఉన్న గ్లాస్ భాగం కనిపిస్తుందా? అని పిల్లల్ని అడిగాడు. పిల్లలు లేదని చెప్పారు. అందుకు కారణం… గ్లాస్, వంటనూనె వక్రీభవన గుణకం సమానంగా ఉంటాయని వివరించాడు.
‘ఏవైనా రెండు వస్తువులు, పదార్థాల వక్రీభవన గుణకం సమానంగా ఉన్నప్పుడు వాటిగుండా కాంతి ప్రసరించదు. అందుకనే గ్లాస్ కనిపించలేదు. గాలి, గ్లాస్ వక్రీభవన గుణకం ఒకేలా ఉండదు. అందుకనే గాలితో నిండిన గ్లాస్ భాగం కనిపించింది అంటూ వివరించాడు. ఈ టీచర్ పిల్లలకు వివరిస్తున్న వీడియోను దీపక్ ప్రభు అనే యూజర్ ట్విట్టర్‌లో పెట్టాడు.
ఈ వీడియోను ట్విట్టర్‌లో 80 వేల మందికి పైగా చూశారు. ‘వావ్…. సులువైన ప్రయోగంతో పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా చెప్పావు’ అంటూ ఈ టీచర్‌ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
:: Also Read ::
చెట్ల నుంచి కాగితం ఎలా తయారు చేస్తారో తెలుసా!
పేపర్ (కాగితం).. ఇది వాడని మనుషులు ఉండరు. ఒక మనిషి తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాగితాన్ని ఉపయోగిస్తాడు. పాఠశాలలు, కళాశాలలు, సంస్థలు, హోటళ్లు, ఆఫీసులు వీటిల్లో కాగితం అవసరం చాలా ఉంటుంది. మరి మన దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ కాగితాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసా. అసలు ఎన్ని రకాల పేపర్లు ఉన్నాయి? కాగితం తయారీకి ఉపయోగించే చెట్లు ఏవి? ఒక చెట్టు నుంచి ఎంత పేపరును తయారు చేయవచ్చు.
దీనిపై ప్రత్యేక కథనం మీకోసం..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..