రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లు, ఫార్మసీ సంస్థలలో డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సుల ప్రవేశాల షెడ్యూలును సాంకేతిక విద్యాశాఖ జనవరి 13న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూల్‌‌ ప్రకారం అభ్యర్థులు జనవరి 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి జనవరి 19, 20 తేదీల్లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు జనవరి 19 నుంచి 21 వరకు కళాశాలలు ఎంపిక (వెబ్‌ఆప్షన్లు నమోదు) చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ఆప్షన్లు పూర్తయిన అభ్యర్థులకు జనవరి 23న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు  పొందిన అభ్యర్థులకు జనవరి 24 నుండి తరగతులు ప్రారంభంకానున్నాయి. అభ్యర్థులు వెరిఫికేషన్‌ కోసం అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.


అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..


➥ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి జారీ చేసిన ఫార్మా-డి 2022 ర్యాంక్‌ కార్డ్‌.


➥ ఇంటర్మీడియట్‌ మార్కు లిస్టు, 


➥ పదోతరగతి మార్కుల మెమో


➥ 6 నుండి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికేట్లు


➥ ఫీజు రీ ఎంబర్స్‌ నిమిత్తం అర్హత కలిగిన వారు తెలుపు రేషన్‌ కార్డు, 2019 జనవరి ఒకటి తరువాత జారీ చేయబడిన అదాయ దృవీకరణ పత్రం


➥ రిజర్వేషన్‌ కు అర్హత కలిగిన వారు కుల దృవీకరణ పత్రం సిద్దంగా ఉంచుకోవాలి.


➥ దివ్యాంగులు, సాయిధ దళాల సిబ్బంది, క్రీడా కోటాకు అర్హులు, మైనారీటీలు వారి అవసరాలకు అనుగుణంగా ధృవీకరణ పత్రాలు సిద్దంగా ఉంచుకోవాలి. 


➥ అవసరమైన బదిలీ ధృవీకరణ, వర్తిస్తే ఇడబ్ల్యుఎస్‌ ధృవీకరణ ఉండాలి. 


➥ దివ్యాంగ, NCC కోటా, స్పోర్ట్స్ కోటాకు అర్హులైన ప్రత్యేక కేటగిరీల వారు సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ కోసం జనవరి 19న విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు, ఇతర అభ్యర్థులు జనవరి 19, 20 తేదీల్లో విజయవాడతో సహా విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌‌లలోని హెల్ప్‌ లైన్‌ సెంటర్‌లలో ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. 1వ ర్యాంకు నుండి చివరి ర్యాంక్‌ వరకు అందరికీ ఇదే వర్తిస్తుందని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.


Also Read:


గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎంబీబీఎస్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పొడిగింపు!
ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏడాదిపాటు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ చేసేందుకు ప్రస్తుతమున్న 2023 మార్చి 31 కటాఫ్ తేదీ గడువును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు త్వరలో ప్రకటన వెలువడనున్నట్లు అధికార వర్గాలు జనవరి 12న వెల్లడించాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), విద్యార్థి సంఘాలు, భావి అభ్యర్థులు, పలు రాష్ట్రాల అధికారుల అభ్యర్థన మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకొంది. ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పొడిగించడంతో.. ఈ ఏడాది మార్చి 5న ఉంటుందని ప్రకటించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను సైతం వాయిదా వేయాలనే డిమాండు విద్యార్థులు, వారి కుటుంబాల నుంచి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...