Petrol Manufacturing Process: ప్రస్తుతం ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్, గ్యాస్ గురించే చర్చ నడుస్తోంది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం అన్ని వర్గాలను ఎఫెక్ట్ చేసింది. పశ్చిమాసియాలో అశాంతి వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా దెబ్బతిన్నది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మనం రోజూ బైక్ లేదా కార్లలో పెట్రోల్ ఫిల్ చేయించుకుంటాం కానీ, అసలు ఈ పెట్రోల్ ఎక్కడ పుడుతుంది. అది మన దాకా ఎలా వస్తుంది. భూమిలో నుంచి తీసిన నల్లటి ద్రవం మన ఇంజిన్‌ను నడిపే స్వచ్ఛమైన ఇంధనంగా ఎలా మారుతుంది వంటి ఆసక్తికరమైన విషయాలు గురించి ఇక్కడ చూద్దాం.
భూగర్భం నుంచి ముడి చమురు వెలికితీత
పెట్రోల్ తయారీ ప్రక్రియ నేరుగా పెట్రోల్‌తో మొదలవ్వదు. దీనికి మూల ముడి చమురు. లేదా క్రూడ్ ఆయిల్. దీనిని భూమిలో చాలా లోతుగా డ్రిల్లింగ్ చేసి బయటకు తీస్తారు. ఇది చూడటానికి చాలా నల్లగా చిక్కటి ద్రవంలా ఉంటుంది. దీనిని మనం నేరుగా వాహనాల్లో వాడ లేదు. ఎందుకంటే ఈ నల్లటి ద్రవంలో పెట్రోల్‌తోపాటు మనం ఇంట్లో వాడే ఎల్‌పీజీ, కిరోసిన్, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్, రోడ్లు వేయడానికి వాడే తారు వంటి ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి.
అసలైన మార్పు ఇక్కడే
భూమిలో నుంచి తీసిన ఈ ముడి చమురును పైపులైన్ల లేధా భారీ నౌకల ద్వారా రిఫైనరీలకు తరలిస్తారు. ఇటీవలే ఇరాన్ యుద్ధం కారణంగా హుర్ముజ్ జలసంధిలో మన భారతీయ కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు ఇలాంటి చమురు నౌకనే ప్రాణాలకు తెగించి ముంబైకి చేర్చారు. రిఫైనరీకి చేరుకున్న తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ ఫ్యూరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
మరిగించడం- డిస్టిలేషన్ టవర్
రిఫైనరీలో ఒక పెద్ద ఫర్నెస్ ఉంటుంది. ఇది పొయ్యిలాంటిదన్నమాట. అందులో ఈ ముడి చమురును 350 నుంచి 400 డిగ్రీల సెల్సియస్ వరకు విపరీతంగా వేడి చేస్తారు. అంత వేడి తగలగానే ఆ నల్లటి ద్రవం రిగి గ్యాస్ లా మారిపోతుంది. ఈ వేడి గ్యాస్‌ను పొడవాటి డిస్టిలేషన్ టవర్‌లోకి పంపిస్తారు. ఈ టవర్‌కు ఒక ప్రత్యేక ఉంది. ఇందులో కింద భాగంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది.
ఇక్కడి నుంచి వివిధ ఉత్పత్తులు వస్తాయి
ఆవిర రూపంలో ఉన్న చమురు ఆ టవర్‌లోకి పైకి ప్రయాణిస్తున్నప్పుడు అది చల్లబడి మళ్లీ లిక్విడ్‌గా మారుతుంది. అయితే ఒక్కో పదార్థం ఒక్కో టెంపరేచర్ దగ్గర లిక్విడ్‌గా మారుతుంది.
తారు
ఇది చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి టవర్ అడుగు భాగంలో సెటిల్ అయిపోతుంది. దీనిని రోడ్లు వేయడానికి ఉపయోగిస్తారు.
డీజిల్, హెవీ ఆయిల్స్
ఇవి మధ్యస్థం కంటే కొంచెం కింద భాగంలో లిక్విడ్‌గా మారుతాయి.
పెట్రోల్
ఇది కొంచెం తేలికైనది. కాబట్టి టవర్ మధ్య భాగం వరకు ఆవి రూపంలో వెళ్లి అక్కడ టెంపరేచర్ ద్వారా లిక్విడ్‌గా మారుతుంది. అక్కడే దీనిని వేరు చేసి సేకరిస్తారు.
ఎల్పీజీ గ్యాస్
ఇది అన్నింటి కంటే తేలికైనది కాబట్టి ఆవిరి రూపంలో టవర్ పైభాగం వరకు వెళ్లి అక్కడ సేకరిస్తారు.
ఇంజిన్ కోసం స్పెషల్ టచ్
టవర్ నుంచి సేకరించిన పెట్రోల్‌ను నేరుగా వాడు. దీనిని మళ్లీ ప్యూరిఫై చేస్తారు. మీ వాహనం ఇంజిన్ పాడవకుండా ఉండటానికి, మరింత మైలేజీ రావడానికి ఇందులో కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్ కలుపుతారు. ఆ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాతే అది మన రోజూ చూసే పెట్రోల్‌గా మారి, పెట్రోల్ బంకులు చేరుకుంటుంది.
మనం బైక్‌లో పోయించుకున్న పెట్రోల్ వెనుక ఇంత పెద్ద ప్రక్రియ ఉంది. భూమిలోంచి తీయడం, వేల కిలోమీటర్‌లు ప్రయాణించి రిఫైనరీ చేరడం, అక్కడ 400 డిగ్రీల దగ్గర మరిగించడం, ఇదంతా ఒక యజ్ఞంలా సాగుతుంది.
