తెలంగాణలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో చదువుతున్న విద్యార్థుల్లో 5 లక్షల మందికి ఆధార్ కార్డు లేదు. రాష్ట్రంలో మొత్తం  43,043 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 58 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈక్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో వంద శాతం ఆధార్ నమోదు చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా పాఠశాలల్లో ఏటా పదోతరగతి విద్యార్థులు చదువు పూర్తయి వెళ్లిపోతుంటారు. అదేవిధంగా ఒకటో తరగతిలో కొత్తగా ప్రవేశాలు పొందుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు సైతం పాఠశాలల్లో ప్రవేశాలకు పొందుతుంటారు.


ప్రతి విద్యాసంవత్సరం పాఠశాల విద్యాశాఖ 'చైల్డ్ఇన్ఫో' పేరిట పాఠశాలల వారీగా పిల్లల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది. విద్యార్థులు ఒకచోట నుంచి మరోచోటకు మారినా ట్రాకింగ్ చేసేందుకు ఆధార్ సంఖ్యను సేకరిస్తున్నారు. ఆధార్ సమర్పించని 5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని వారు 2 లక్షల మంది, ప్రైవేట్ స్కూళ్లలో మరో 3 లక్షల మంది ఉన్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌లో కొందరు విద్యార్థులకు ఆధార్ సంఖ్య ఉన్నా వాటిని ఇవ్వడం లేదని ఓ అధికారి తెలిపారు.


విద్యార్థుల చెంతకే 'ఆధార్' సేవలు..
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే 6-10 తరగతుల విద్యార్థుల్లో 50 వేల మందికి ఆధార్ లేదు. దీనికితోడు ఏప్రిల్ తర్వాత పరీక్షలు పూర్తయి పదోతరగతి విద్యార్థులు బయటకు వెళ్లిపోతారు. వారందరికీ మార్చినాటికి ఆధార్ సంఖ్యను ఇవ్వాలన్నది పాఠశాల విద్యాశాఖ లక్ష్యం. అందుకే 100 ఆధార్ నమోదు కిట్లను క్షేత్రస్థాయికి పంపామని అధికారి ఒకరు చెప్పారు. మండల రీసోర్స్ సెంటర్లలో వాటిని ఉంచనున్నారు. వేలిముద్రలను అప్‌డేట్ చేయడంతో పాటు ఆధార్‌ లేని వారికి దాన్ని ఇస్తారు. విద్యార్థులందరికీ 2017 సెప్టెంబరు నాటికే ఆధార్ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం. దాన్ని సాధించేందుకు 2018లో పాఠశాల విద్యాశాఖ ఆధార్ పరికరాలను సమకూర్చుకుంది. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో కరోనా కారణంగా ఆధార్ నమోదు ఆగిపోయింది. వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం మందికి ఆధార్ సంఖ్య సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.


Also Read:


ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు, అసర్ సర్వేలో వెల్లడి!
దేశంలో గత దశాబ్ద కాలంగా ఏటా 60 కంటే తక్కువ విద్యార్థులు చేరుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అసర్ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో గల అయిదేళ్ల చిన్నారుల్లో మూడింట ఒకవంతు మంది ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి కంటే తక్కువ తరగతిలోనే చదువుతున్నారు. నూతన విద్యా విధానం ప్రకారం దేశంలో 1వ తరగతిలో చేరడానికి చిన్నారులకు కనిష్ఠంగా ఆరేళ్ల వయసు వచ్చి ఉండాలి.
నివేదిక వివరాల కోసం క్లిక్ చేయండి..


'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌!
ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌ అందుతుంది. 
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..